టీడీపీ లోకి ఎర్రబెల్లి ప్రయాణం …ఇదేనా సాక్ష్యం?

Posted December 2, 2016

Image result for errabelli dayakar in srikalahasti temple

అదిగదిగో…వస్తున్నాడదిగో ఎర్రబెల్లి అంటూ తెలంగాణ టీడీపీ శ్రేణులు పాడుతున్న పాట నిజం కాబోతుందా?నిజమేనన్న సంకేతాలు అక్కడక్కడా కనిపిస్తూనే వున్నాయి.టీ టీడీపీ ఆశల్ని నిజం చేయడానికి ఏపీ లోని తెలుగు తమ్ముళ్లు బిస్కెట్ వేసేస్తున్నారు.ఎర్రబెల్లి కూడా ఆ బిస్కెట్ బాగానే నమిలి తింటున్నారు.పేరుకి అయన తెరాస లో వున్నా ఆ పార్టీలో ఆయనకి ఆ స్థాయి మర్యాద దక్కడంలేదు.కానీ తెలుగు తమ్ముళ్లు పాత బంధాన్ని గుర్తు చేసుకుని మరీ ఎర్రబెల్లికి పెద్ద పీట వేస్తున్నారు.కావాలంటే మీరే చూడండి.

కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి వెళ్లిన ఎర్రబెల్లికి అక్కడ దగ్గరుండి మరీ మర్యాదలు చేసింది ఎవరో తెలుసా? ఏపీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి తనయుడు సుధీర్ …ఎర్రబెల్లి కాళహస్తిలో ఉన్నంత సేపు అక్కడే వున్నారు.ఆలయం లో ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు ఏది అవసరమైనా బొజ్జల కొడుకే చూసారు.ఏపీ లో ఓ తెరాస నేతకి ఈ స్థాయి మర్యాద జరగడం విచిత్రమే ..అయినా అదంతా దేశం మహిమే..ఇది చూసాక కూడా ఎర్రబెలి వయా ఏపీ టూర్ తో టీడీపీ లోకి ప్రయాణిస్తున్నట్టు లేదూ!