ముందు ఆస్తులు చెప్పండి..మంత్రులకి సీఎం షాక్ ..

0
50

Posted April 18, 2017

yogi adityanath said to the cabinet ministers give me your assets list
ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గానికి ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్ యోగి అదిరిపోయే షాక్ ఇచ్చారు. బాబోయ్ ఈ మంత్రివర్గంలో చోటు ఎందుకు దక్కిందా అని వాళ్ళు ఇప్పటికే బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ బాధ రెట్టింపయ్యే స్థాయిలో యోగి నిర్ణయాలు ప్రకటించారు.అధికారిక క్యాబినెట్ మీటింగ్ అని చెప్పకుండా మంత్రులంతా కలిసి మాట్లాడుకుందామని యోగి పిలిచారు.ఏదో పార్టీ ఉంటుందనుకుని అక్కడికెళ్లిన మంత్రులకి షాక్ తగిలింది. తన మంత్రి వర్గంలో ఏ ఇబ్బంది లేకుండా కొనసాగాలంటే ఈ పనులు చేయాలని కొన్ని షరతులు ముందుంచారు.అవి ఏమిటంటే ..

1 .మంత్రులు ఎవరైనా ఏ వ్యాపార సంస్థలో భాగస్వాములైనా ఆ వివరాలు అందించాలి.
2 . క్యాబినెట్ లో ఉండగా లాభదాయక పదవుల్లో కొనసాగరాదు.
3 . అవినీతికి దూరంగా ఉండాలి.
4 . 15 రోజుల్లోగా ఆస్తుల వివరాలు అందించాలి
5 . ప్రభుత్వం తో సంబంధం వున్న మంత్రుల బంధువుల వివరాలు వెల్లడించాలి.
6 . పదవులు అడ్డం పెట్టుకుని ఏ వ్యాపారాలు చేయకూడదు.
7 . ఆర్భాటపు వేడుకలకి దూరంగా ఉండాలి
8 . 5 వేల కంటే ఖరీదైన బహుమతి ఎవరు ఇచ్చినా ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి
9 . అధికారిక పర్యటనల్లో ప్రభుత్వ బంగళాలో మాత్రమే బస చేయాలి .
యోగి ఈ లిస్ట్ చదవగానే అక్కడ కూర్చున్న వారిలో సగం మందికి చెమటలు పట్టాయట.ఇక మిగిలిన వారి పరిస్థితి దాదాపు అదే.చూద్దాం ..యోగి రూల్స్ ఎంత వరకు ఫాలో అవుతారో?