వేలు పెట్టకుండానే ఇన్ని రూమర్లా బాబు..!

Posted November 17, 2016

Young Hero Clarify About Rumoursకుర్ర హీరోలు తమ సినిమాలను హిట్ చేయాలనే ఆలోచనతో డైరక్టర్ ఒకటి చెబితే అలా కాదు ఇలా చేద్దామని మార్చి చేస్తుండటం మాములే. అయితే ఇలా వచ్చిన రూమర్స్ అన్నిటిలో ఎంతవరకు నిజం ఉంటుంది అన్నది చెప్పలేం కాని కచ్చితంగా హీరోల తమ పైత్యాన్ని దర్శక నిర్మాతల దగ్గర చూపిస్తారు అన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ఇక మరి కుర్ర హీరో నిఖిల్ విషయంలో ఈ టాక్ ఎక్కువగా ఉంటుంది. దర్శకుడు కొత్త వాడైతే అసలు నిఖిల్ ఏమాత్రం అతనికి రెస్పెక్ట్ ఇవ్వడని.. సెట్స్ లో కూడా అంతా తనకు నచ్చినట్టుగా చేస్తాడని.. సీన్ కూడా తనకు తానే ఇంప్రవైజ్ చేస్తాడని ఏవేవో రూమర్స్ ఉన్నాయి.

వీటన్నిటికి నిఖిల్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలో తన లేటెస్ట్ సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా ప్రమోషన్స్ లో వాటి గురించి మాట్లాడాడు. తానేదో దర్శక నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న వార్తలు వస్తున్నాయని.. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని.. దర్శకుడితో కథా చర్చలు నడిపి ఓ సారి కమిట్ అయితే ఇక అందులో తాను వేలు పెట్టనని అన్నాడు నిఖిల్. అయితే ఏం చేయకుండానే ఇన్ని రూమర్స్ వస్తాయా బాబు.. తన వ్యవహారం బయటకు వచ్చేసరికి ఇలా మాట మార్చాడే తప్ప సినిమాలో నిఖిల్ జోక్యం ఎక్కువవడం కేవలం ఈ సినిమాలోనే కాదు ఇంతకుముందు సినిమాల్లో కూడా చేసినట్టు టాక్. మరి ఇకనుండైనా తన పద్ధతి మార్చుకుని బొత్తిగా ఉంటే బెటర్ లేదంటే మంచి మంచి అవకాశాలు మిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.