మహేష్ తో ఛాన్స్ కొట్టేసిందా..!

Posted November 16, 2016

Young Heroine Lucky Chance With Maheshసూపర్ స్టార్ మహేష్ తో ఛాన్స్ అంటే ఏకంగా స్టార్ హీరోయిన్ గా రెడ్ కార్పెట్ పడ్డట్టే. ప్రస్తుతం ఓ రెండు సినిమాలతో క్రేజ్ సంపాదించిన ఓ లక్కీ హీరోయిన్ మహేష్ తో జోడి కట్టే ఛాన్స్ దక్కించుకుందట ఇంతకీ ఆ లక్కీ హీరోయిన్ ఎవరు అంటే కీర్తి సురేష్ అని తెలుస్తుంది. మలయాళం నుండి వచ్చిన ఈ భామ నేను శైఅలజతో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత నానితో నేను లోకల్ అంటూ రాబోతున్న కీర్తి కొరటాల శివ మహేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు సెలెక్ట్ అయ్యిందని టాక్.

ఇప్పటికే కోలీవుడ్ లో కుర్ర హీరోలతో పాటుగా స్టార్ హీరోలతో జతకడుతున్న కీర్తి మహేష్ ఛాన్స్ అంటే ఇక ఆమె రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. మహేష్ సినిమా కనుక క్లిక్ అయితే కనుక కీర్తి సురేష్ దశ తిరిగినట్టే. ఇప్పటికే ముహుర్తం పెట్టేసిన ఈ సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్నదట. శ్రీమంతుడు తర్వాత కలిసి పనిచేస్తున్న మహేష్, కొరటాల శివ మరో సోషల్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతున్న కీర్తి సురేష్ ను చూస్తుంటే త్వరలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరేట్టు ఉంది. ప్రస్తుతం మహేష్ చేస్తున్న మురుగదాస్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కు ఛాన్స్ ఇవ్వగా కొరటాల మూవీకి మాత్రం కీర్తి సురేష్ ను కావాలని సెలెక్ట్ చేశారట. మరి అమ్మడు ఈ లక్కీ ఛాన్స్ ను ఎలా వాడుకోనుందో చూడాలి.