హార్ట్ బ్రేక్ చేస్తున్న అతిలోకసుందరి

Posted January 31, 2017

youth heartbreaking sridevi picsశ్రీదేవి …ఈ మూడక్షరాల పేరు..ఆమె నగుమోము …ఎన్నో కోట్ల పురుష హృదయాల్లో కొలువైంది.బోనీ కపూర్ ని పెళ్ళాడి ఆ హృదయాల్ని బద్దలు కొట్టింది అతిలోకసుందరి .కొన్నాళ్లుగా ఆమె ఇంటికే పరిమితం కావడంతో ఆ గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయి.కాలం మాన్పిన గాయాలు మళ్లీ రేగుతున్నాయి.దానికి కారణం శ్రీదేవే..కూతురు జాన్వీని వెండి తెరకి పరిచయం చేసేందుకు రెడీ అయిన అతిలోకసుందరి ఆమెతో పాటు కొన్ని ఫొటోల్లో దర్శనమిస్తోంది. ఆ ఫోటోలు చూస్తుంటే కూతురుకి పోటీ వస్తోందా అన్నంతగా వెలిగిపోతోంది శ్రీదేవి.

ఓ విమాన ప్రయాణం తర్వాత ఇద్దరు కూతుళ్లతో బయటికి వస్తున్న శ్రీదేవి ని నిన్న ఫొటోల్లో చూసి పాతకాపుల గుండెలు బద్దలు అవుతుండగానే …ఈరోజు మరో అస్త్రం ప్రయోగించింది అతిలోకసుందరి.జాన్వీతో కలిసి వున్న ఓ ఫోటోని ఈరోజు సోషల్ మీడియా లో పెట్టింది.తాజా ఫోటో చూశాక మరికొన్ని హార్ట్స్ బ్రేక్ కావడం ఖాయమనిపిస్తోంది.