ఫోకస్ లైట్స్ మధ్య లోకేష్..తప్పదా ట్యూషన్?

Posted April 21, 2017 at 10:32

ysrcp blame to nara lokesh because of his speech
లోకేష్ ఇప్పుడు టీడీపీ వ్యతిరేకులకు ఓ వరంలా కనిపిస్తున్నాడు.చంద్రబాబులా లోకేష్ సమర్ధుడు కాదు అని చెప్పడానికి వైసీపీ అనుకూల మీడియా పడుతున్న ఆరాటం చూస్తుంటే నవ్వొస్తోంది.చుట్టూ ఫోకస్ లైట్స్ పెట్టేసి లోకేష్ తెలుగుని,ఆయన మాటల్లో తడబాటు గురించి అదేదో పెద్ద నేరం,ఘోరం అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు.ఇప్పటికిప్పుడు సాక్షి పేపర్ పెట్టే తెలుగు,వక్తృత్వం పోటీల్లో పాస్ అయితే గానీ లోకేష్ రాజకీయాలకి పనికి రాడన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు.అంతెందుకు.. ఏ భాష మీద పట్టుందని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ని ఎక్కువ కాలం పాలించాడు?ఆయన ప్రసంగ శైలి ఎంత గొప్పగా ఉందని జనం కొత్త రాష్ట్ర బాధ్యతలు ఆయనకు అప్పజెప్పారు?ఓ రాజకీయ నేతకి,పాలకుడికి ఉండాల్సిన లక్షణాల్లో భాష,ప్రసంగ శైలి ఓ భాగం మాత్రమే .అదే సర్వస్వం కాదు.అంతెందుకు …ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తన ప్రసంగాల్లో అసలు తెలుగులో అంగీకారం కానీ “మేళ్లు”అనే మాట పదేపదే వాడేవారు.ఆ మాటకి ఆయన బ్రాండ్ అయిపోయారు.ఆయన రాజకీయ ప్రస్థానంలో అదసలు ఎప్పుడు ఓ విషయమే కాదు.

ఇక లోకేష్ తడబాట్ల గురించి,పొరపాట్ల గురించి కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.ఓ విధంగా చెప్పాలంటే గడిచిన నెలరోజుల్లో ఆయన గురించి వచ్చిన ఇలాంటి వార్తలు చూసి బోర్ కొట్టేస్తోంది.ఎప్పుడైతే భాష మీద పట్టు తక్కువగా ఉంటుందో అప్పుడు ఈ తడబాట్లు సర్వసహజం.పైగా లోకేష్ ఏమీ మహా నేత కాదు.ఇప్పుడిప్పుడే తండ్రి నీడ నుంచి బయటికి వస్తున్న యువ నాయకుడు. ఆయన మీద భూతద్దం వేసి ప్రతీది తప్పని చెప్పడం వల్ల అలా చేసే వాళ్ళ ప్రయోజనం నెరవేరదు.2004 లో వై.ఎస్ గెలిచిన నెలల వ్యవధిలోనే టీడీపీ అనుకూల మీడియా ఇదే వైఖరి అనుసరించి బొక్కబోర్లా పడింది.అందుకని లోకేష్ ఈ వ్యవహారాలకు అధిక ప్రాధాన్యమిచ్చి ట్యూషన్ పెట్టించుకోవాల్సిన పనిలేదు.ప్రజలు,నేతలు ఎక్కువ మందితో కలవడం,వారితో ఎక్కువగా మాట్లాడడం చేస్తే చాలు.