ఈ మాత్రం దానికి ఢిల్లీ దిగాలా భూమనా..?

0
59

 Posted April 29, 2017 at 10:14

YSRCP Leader Bhumana Karunakar Reddy land in delhi about giving to report on Chandrababuజగన్ కు బెయిల్ వస్తుందా.. రాదా అనే విషయం ఇవాల్టితో తీరిపోయింది. ఆయన బెయిల్ రద్దు పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. దీంతో జగన్ కు ఊరట దక్కింది. అంతే అదిగో పులి అంటే.. ఇదిగో తోక అంటూ వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. కొన్ని మీడియా ఛానెళ్లలో జగన్ కు బెయిల్ రద్దు అంటూ ప్రసారం చేశారని, టీడీపీ నేతలైతే యూపీయే సర్కారుతో కుమ్మక్కై జగన్ కు జైలుకు పంపించినట్లు పరోక్షంగా చెబుతున్నారని ఆరోపించారు. తమ నేతపై ఐదు ఛార్జ్ షీట్లు దాఖలై కేసులు పెట్టినా.. వైసీపీ తీరు మాత్రం మారలేదు.

ఇది చాలదన్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీఏ సర్కారుతో కూడా కుట్ర చేయించడానికి ప్రయత్నించారని వైసీపీ నేత భూమన ఆరోపించడం పైత్యానికి పరాకాష్టగా మారింది. ఇప్పుడు బెయిల్ కొనసాగినంత మాత్రాన జగన్ నిర్దోషి అయిపోతారా.. అన్న కనీస ఆలోచన చేయడం లేదు వైసీపీ నేతలు. జగన్ ఎప్పుడు జైలుకెళ్తారోనని ఆందోళన చెందుతున్న క్యాడర్ చెవిలో పూలు పెట్టడానికి.. నేతలు ఉద్దేశపూర్వకంగా బిల్డప్ ఇస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల ముందు కూడా ఇలాగే ఓవరాక్షన్ చేసి.. జగన్ కు ఉన్న సానుభూతి కూడా పోగొట్టిన నేతలు.. ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తున్నారు.

తప్పు చేసిన జగన్ జైలు నుంచి బెయిల్ పై విడుదలై.. ఏదో విజయయాత్ర చేసినట్లుగా ఇంటికి చేరడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుంది. ఇక ఏపీ ప్రజలకు జగన్ పై నమ్మకమే లేదు. అందుకే చంద్రబాబుకు ఓటేశారు. జగన్ అవినీతికి మారుపేరని ఇంకా చాలా మంది విశ్వసిస్తున్నారు. అసలు కొన్ని జిల్లాల్లో అయితే జనం జగన్ మాట చెబితేనే భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ను పనిగట్టుకుని రాజకీయంగా దెబ్బతీయాల్సిన అవసరం చంద్రబాబుకి ఏముందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రధాని మోడీ పరిష్కరించాల్సిన సమస్యలు సవాలక్ష ఉన్నాయి. అలాంటప్పుడు జగన్ కోసం అంత సీరియస్ గా చర్చిస్తారా అనే కనీస అవగాహన కూడా వైసీపీకి లేదని విమర్శలు వస్తున్నాయి.