మోడీని జగన్ మీదకు ఉసిగొల్పుతున్నారా?

Posted November 24, 2016

ysrcp mps are attacking on jagan through modi
వైసీపీ అధినేత జగన్ మీదకు ప్రధాని మోడీని ఉసిగొల్పుతున్నారు..ఈ పనికి పాల్పడేది ఎవరో తెలుసా? వైసీపీ ఎంపీ లే …అలా ఎందుకు జరుగుతుందిలే అనుకోవచ్చు.కానీ ఢిల్లీలో ఇవాళ ఆ పార్టీ ఎంపీలు నోట్ల రద్దు మీద మాట్లాడింది చూసాక ఈ అభిప్రాయం కలగక మానదు.ఇంతకీ వైసీపీ ఎంపీ లు ఏమన్నారో చూడండి..

‘పెద్ద నోట్ల రద్దుకి సంబంధించి మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదే …కానీ సామాన్యులకి ఇబ్బంది లేకుండా చూడటంలో కేంద్రం విఫలమైంది.ఇప్పటివరకు ఒక్క పెద్ద తలకాయని టార్గెట్ చేసిన దాఖలాలు లేవు.విదేశాల్లో బడా బాబులు దాచుకున్న డబ్బు ఒక్క పైసా కూడా వెనక్కి తిరిగి రాలేదు.’ఇలా వైసీపీ ఎంపీ లు మాట్లాడిన నాలుగు అంశాల్లో చివరి రెండు చూస్తే జగన్ టార్గెట్ అనిపించడం లేదా?