టీడీపీ కి పెడన షాక్ … జగన్ బీ కేర్ ఫుల్

0
130

Posted September 29, 2016

  ysrcp shock too tdp over pedana municipal council elections

అధికారం ఉంటే అన్నీ వాటంతట అవే జరిగిపోతాయనుకుంటే … ఎంత పొరపాటో ఏపీ టీడీపీ కి తెలిసొచ్చింది. నిర్లక్ష్యానికి ఎంత భంగపాటు మూల్యం చెల్లించాల్సి వస్తుందో అర్థమైంది. తమకు కంచుకోట అనుకున్న కృష్ణా జిల్లాలోనే అధికార తెలుగుదేశానికి ఈ పరిస్థితి ఎదురైంది. ఎవరూ ఊహించని విధంగా పెడన మున్సిపాలిటీని వైసీపీ దక్కించుకొంది.

పెడన మున్సిపాలిటీకి అప్పట్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైకాపా తరపున చెరో 11 మంది కౌన్సిలర్లుగా గెలిచారు. ఇక్కడ దేశం ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ ఉండటంతో అధికార పక్షం ధీమాగా వుంది. మున్సిపల్ చైర్మన్ ఆకస్మిక మృతితో మళ్లీ ఆ స్థానానికి ఎన్నిక జరిగింది. అయితే అధికార పక్షానికి చెందిన కౌన్సిలర్ స్రవంతి అనూహ్యంగా వైకాపా అభ్యర్థి బండారు ఆనందప్రసాద్ కి ఓటేయడంతో సీన్ మారిపోయింది. పెడన మున్సిపాలిటీ వైసీపీ సొంతమైంది. ఆలస్యంగా మేల్కొన్న అధికార పక్షం ఇపుడు పోస్ట్ మార్టం చేస్తోంది. అనూహ్య విజయంతో వైసీపీ సంతోషపడుతుండొచ్చు. అయితే ఇక నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యే లపై పోరాటానికి పెడన అడ్డుగా నిలుస్తోందేమో! బీ కేర్ ఫుల్ జగన్ …