మీలో ఎవరు కోటీశ్వ‌రుడు తెలుగు బులెట్ రివ్యూ…

0
674
milo evaru koteswarudu review

Posted [relativedate]

milo evaru koteswarudu reviewచిత్రం : మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు (2016)
నటీనటులు : నవీన్‌చంద్ర, శృతి సోధి, పృథ్వీ, సలోని
సంగీతం : శ్రీ వసంత్
దర్శకత్వం : ఇ.సత్తిబాబు
నిర్మాత : కె.కె.రాధామోహన్‌
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్, 2016.

బుల్లితెరపై ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ సూపర్ డూపర్ హిట్. కింగ్ నాగార్జున హోస్ట్ గా ‘మా టీవీ’లో ప్రసారమైన ఈ గేమ్ షో.. ఇప్పటికే 3 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొంది. కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టింది.. ఈ ప్రోగ్రామ్. మా టీవీకి మంచి రేటింగ్స్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు 4వ సీజన్  కోసం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇప్పుడిదే టైటిల్  ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’తో వెండితెరపై సందడి మొదలైంది.

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ 30ఇయర్స్ పృధ్వీ హవా కొనసాగుతోంది. పృధ్వీ హీరోగా చేసిన తొలి సినిమా ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో నవీన్‌చంద్ర – శృతి సోధి, పృథ్వీ – సలోని జంటలుగా తెరకెక్కిన చిత్రమిది. ల‌వ్‌, రొమాంటిక్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెరకెక్కిన ఈ
చిత్రంపై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ నే కారణం. పృధ్వీ మార్క్ పంచ్ డైలాగ్స్ ట్రైలర్స్ లో బాగా పేలాయ్. సినిమాలో ఈ మార్క్ పంచ్ డైలాగ్స్, కామెడీ సీన్స్ బోలేడు ఉంటాయని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. ఈ కామెడి ఎంటర్ టైనర్ ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అసలు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అసలు కథేంటీ.. ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుందో తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
ప్రశాంత్ (నవీన్ చంద్ర) ఓ కాలేజ్ స్టూడెంట్. కాలేజ్ టాపర్ కూడా. మనోడు అమ్మాయిలకి కాస్త దూరం. అందుకే కాలేజ్ టాపర్ గా రాగలిగాడు అనుకోండీ !. ఓ
అర్థరాతి ఫుల్ గా తాగిన అమ్మాయి ప్రియా (శృతిసోధీ) కారుని డివైడర్ కి గుద్దేస్తోంది. ఆ టైంలో అక్కడే ఉన్న ప్రశాంత్… ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ల ఇంట్లో దిగబెట్టి వస్తాడు. అప్పటి నుంచి ప్రశాంత్ పై మనసుపారేసుకొంటోంది ప్రియా. మొదట కాస్త తటపటాయించినా చివరికి ప్రియా ప్రేమలో పడిపోతాడు ప్రశాంత్. డబ్బుకోసమే తన కూతురిని ప్రేమలోకి దించావని ప్రశాంత్ ప్రేమని అనుమానిస్తాడు ప్రియా తండ్రి ఏబీఆర్(మురళీ శర్మ). నిజమైన ఆనందం డబ్బులో ఉండదు. ఒక్కసారి మీరు ఓ బిజినెస్ లో ఫుల్లుగా లాస్ కండీ అప్పుడు తెలుస్తోంది నిజమైన ఆనందమని చెబుతాడు ప్రశాంత్.

ఇక, బిజినెస్ లో లాస్ కోసం ఒక్క హిట్టు కూడా లేని రోల్డ్ గోల్డ్ రమేష్ (రఘుబాబు) దర్శకత్వంలో పృధ్వీ, సలోని జంటగా ఓ సినిమా తీస్తాడు ఏబీఆర్. ఆ సినిమా రిజల్ట్ ఏమైంది.. ? చిత్రంలో పోసాని ఎవరు ?? చివరికి ప్రశాంత్-ప్రియాలు తమ ప్రేమని గెలిపించుకొన్నారా.. ??? అన్నది పిచ్చ కామెడీతో కూడిన మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

 •  పృధ్వీ
 •  కామెడీ
   నేపథ్య సంగీతం
  మైనస్ పాయింట్స్ :
 • కొత్తదనం లేని కథ
 • అక్కడక్కడ బోరింగ్ సన్నివేశాలునటీనటుల ఫర్ ఫామెన్స్ :
  దర్శకుడు ఇ.సత్తిబాబు ది కామెడీ ఎంటర్ టైనర్ లో తీయడంలో ప్రత్యేక శైలి. ఆ అనుభవం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో కనబడింది. పేరడీ సీన్స్ నుంచి కామెడీని బాగా రాబాట్టాడు. నవీన్ చంద్ర కూడా హీరో అయినా.. పృధ్వీ పాత్రపై ఎక్కువ ఫోకస్ చేశారు. 30ఇయర్స్-పృధ్వీ తనమార్క్ పంచ్ డైలాగ్స్ అదరగొట్టాడు. అయితే, ఇదివరకే ఆయన్ని ఇలాంటి సీన్స్ చూసిన ప్రేక్షకులకి కొత్తదనం అనిపించదు. పోసాని కృష్ణమురఌ, రఘుబాబు, మురళీ కృష్ణ, జయప్రకాష్ రెడ్డి లు ఆయా పాత్రలకి బాగా సూట్ అయ్యరు. పృధ్వీ, సలోని జంట తెరపై బాగుంది. కొన్ని నవ్వులని కూడా పంచింది ఈ జంట. శృతి సోధీ పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.సాంకేతికంగా :
  నవీన్ చంద్ర – శృతిసోధీ, పృధ్వీ-సలోని.. ఈ రెండు విభిన్నమైన కథలని ఒకే కథలో చూపించడంలో దర్శకుడు ఇ.సత్తిబాబు సక్సెస్ అయ్యాడు. శ్రీ వసంత్
  అందించిన పాటలు సో..సో గానే ఉన్నా.. నేపథ్య సంగీతం ఆకట్టుకొంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. తెరపై సినిమా రిచ్ లుక్ కనిపిస్తోంది.ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

  తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో పృధ్వీ మార్క్ పంచ్ డైలాగ్స్, కామెడీకి కొదవలేదు. అయితే, ఇప్పటికే కమెడియన్ ఇలాంటి ఎంటర్ టైన్ మెంట్ ని పంచాడు
  పృధ్వీ. ఇందులో కొత్తదనం లేకున్నా.. ఎంటర్ టైన్ మెంట్ ఉంది. కాసేపు కాలక్షేపం కోసం.. ఓసారి కోటీశ్వరుడిని చూడొచ్చు.

  బాటమ్ లైన్ : మీలో ఎవరు కోటీశ్వరుడు.. కొత్తదనం లేని కోటీశ్వరుడు
  రేటింగ్ : 2.5/5

Leave a Reply