‘సాంగత్యం’

సజ్జన సాంగత్యం… అంటే మంచి వాళ్ళతో కలిసి ఉంటే అంతా మంచే జరుగుతుందని పెద్దల మాట… ఈ సజ్జన సాంగత్యం గురించి వివేకానందుడు తనదైన శైలిలో వివరించారు ..

ఆకాశం నుంచి రాలే చినుకు చుక్క నేరుగా చేతిలో పడితే అది తాగటానికి పనికి వచ్చే మంచి నీరు అవుతుంది. అదే వర్షపు మురుగుంతలో పడితే కాళ్ళు కడుక్కోవడానికి కూడా పనికిరాదు. అదే వాన నీటి బిందువు వేడిగా ఉన్న పెనం మీద పడితే క్షణాలలో ఆవిరైపోతుంది. అదే వర్షపు చుక్క తామరాకు మీద పడితే ముత్యంలా మెరుస్తుంది. ఆల్చిప్ప మీద పడితే అది నిజంగా ముత్యంలా మారిపోతుంది. నీటి చుక్క ఒక్కటే కాని అది పడ్డ ప్రదేశాన్ని బట్టి దాని విలువ ఎంతగా మారిపోయింది. అదే విధంగా మంచి వాళ్ళతో చెలిమి మనకు ఎంతో మేలు చేస్తుందని స్వామి వివేకానంద ఉద్బోధించారు.

Leave a Reply