వినడానికి విడ్డూరంగా వున్నా ఇది పచ్చి నిజం.. మానవాళికి పెను సవాలు విసురుతున్న జీవుల్లో దోమే మొదటిది.ఏంటీమాటలు ఆ అల్ప జీవి ఏంచేస్తుంది?మహా అయితే కుడుతుంది..మరీ కష్టమనుకుంటే మలేరియా వస్తుంది. నాల్రోజుల్లో అంతా సర్దుకుంటుంది అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం చూడండి.
1.ప్రపంచంలో ఏటా 7 మంది బర్రెలు,దున్నలు కుమ్మడంవల్ల చనిపోతున్నారు.
2.సింహాలు ఏటా 500 మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి.
3.నీటి ఏనుగుల వల్ల దాదాపు 800 మంది మృత్యువాత పడుతున్నారు.
4.సాలీళ్లు కుట్టి ప్రతి ఏడాది 5000 మంది మరణిస్తున్నారు.
5.తేళ్లు కుట్టడం వలన ఏటా 7000 మంది ప్రాణాలు పోతున్నాయి.
6.పాముకాటువల్ల ప్రతిఏడు 10000 మంది చనిపోతున్నారు.
7.ఇక దోమలు కుట్టి ఏటా ఎంత మంది చనిపోతున్నారో తెలుసా.?
దాదాపు 27 లక్షల మంది దోమకాటువల్ల వచ్చే వ్యాధి బారినపడి మరణిస్తున్నారు.ఆఫ్రికా ఖండములో దోమ కాటువల్ల సంభవించే మరణాలు మరీ ఎక్కువగా వున్నాయి.
ఇక ఇప్పుడు ఒప్పుకుంటారా? సింహం కన్నాదోమే డేంజర్ అని…