స్వచ్ఛంద సంస్థలకు బాబు పిలుపు.. బులెట్ పాయింట్స్

cm-babuస్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములు కావాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఆపదల్లో ఆదుకున్నవారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు: ముఖ్యమంత్రి చంద్రబాబు.

బాధితులకు సేవలు అందించిన అధికారులు,అనధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులకు ప్రభుత్వం తరఫున సత్కారం, ప్రశంసాపత్రాలు అందిస్తాం: ముఖ్యమంత్రి చంద్రబాబు.

రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి,ఎలాంటి వివక్షత లేకుండా రాజకీయలాలకు అతీతంగా ఆదుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేసినా అదే వారికి చివరి రోజుగా గుర్తుంచుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఇంత వరద వచ్చినా కరెంటు ఆగలేదు, దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించారు, పంటపోయినా పరిహారం ఇచ్చి ఆదుకుంది అనే భరోసా ప్రజల్లో రావాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా, చంద్రన్న బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు.

రైతులకు నాసిరకం విత్తనాలు అమ్మినవారిపై కఠినచర్యలు, మోసగాళ్లను జైలుకు పంపిస్తాను. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పోలీసు శాఖలు సమన్వయంగా పనిచేయాలి: టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు.

దోమలపై దండయాత్ర కార్యక్రమం ఉత్సాహంగా జరపాలి: టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు.

బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రం కావాలి, అంటువ్యాధుల రహిత రాష్ట్రం కావాలి. దీనికి గుంటూరు జిల్లా నాంది కావాలి: టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు.

అక్టోబర్ 2నుంచి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, 1000 పంచాయితీలు ఓడీఎఫ్ గా ప్రకటిస్తాం: టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు.

వరద బాధితులకు సేవలు అందించండి, ప్రజలనుంచి ప్రశంసలు పొందండి: టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

SHARE