వందల కోట్లు ప్రెస్ నుంచి నేరుగా శేఖర్ రెడ్డి ఇంటికి?

0
225
100 crores to sekhar reddy house

 Posted [relativedate]

 100 crores to sekhar reddy house
నూట ముప్పై ఒక్క కోట్ల కొత్త నోట్లు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ శేఖర్ రెడ్డి ఇంటికి ఎలా వచ్చాయా అని దర్యాప్తు చేస్తున్న అధికారులకి దిమ్మ తిరిగే వాస్తవాలు బయటికొచ్చాయి. శేఖర్ రెడ్డి ఇంటికి ఆ నోట్లు ఏ బ్యాంకు నుంచి రాలేదు.ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా శేఖర్ రెడ్డి ఇంటికి వందలకోట్లు కొత్త నోట్లు వచ్చేసాయి.శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన కొత్త నోట్ల సీరియల్ నెంబర్ చెక్ చేసినప్పుడు ఈ విషయం బయటపడింది.

సాధారణంగా ప్రెస్ నుంచి కొత్త నోట్లు రిజర్వు బ్యాంకు కి వెళతాయి. అక్కడ నుంచి బ్యాంకులకు పంపిణీ చేస్తారు.ఈ సారి నెలకొన్న అసాధారణ పరిస్థితుల రీత్యా కొంత మొత్తాన్ని ప్రెస్ నుంచి నేరుగా స్టేట్ బ్యాంకు కి చెందిన పాలనా కార్యాలయాలకి పంపించారు. అలా వచ్చిన మొత్తాన్ని స్టేట్ బ్యాంకు అధికారులు నేరుగా శేఖర్ రెడ్డి ఇంటికి తరలించారు. ఈ వ్యవహారంలో స్టేట్ బ్యాంకు కి చెందిన 10 మంది ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆ అధికారుల్ని విచారించే ప్రక్రియ మొదలైంది.త్వరలో వారిని అరెస్ట్ చేస్తారు.

Leave a Reply