100 vs 150…

0
515

chiru

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ తన వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిని పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ రెండు సినిమాలకు పోలిక.. పోటీ పెట్టేస్తూ ఇటీవలిగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ ని వెతుక్కోవడంలో ఇబ్బందుల నుంచి.. సంక్రాంతి రిలీజ్ వరకూ ఈ చిత్రాల మధ్య పోలికలు తెస్తున్నారు. రైటర్ సాయి మాధవ్ బుర్రా.. రెండు సినిమాలకు పని చేయడంతో ఈ కంపారిజన్స్‌ మరింతగా పెరిగిపోయాయి.

నిజానికి మెగాస్టార్ చేస్తున్నది పక్కా కమర్షియల్, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. నీటి సమస్యపై సందేశం ఇస్తూనే.. పాటలు-ఫైట్లు అంటూ కమర్షియల్ వేల్యూస్ కి లోటు ఉండని సినిమా ఇది. ఇక, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి చారిత్రకం. బాలయ్య నుంచి ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం వచ్చి ఇరవై ఏళ్లు గడిచింది. 1996లో శ్రీ కృష్ణార్జున విజయం తర్వాత బాలయ్య ఇలాంటి సినిమాల జోలికి పోలేదు. అందుకే ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

చిరంజీవి 150.. బాలయ్య 100 అనే నంబర్స్‌ మినహాయిస్తే.. ఈ రెండు సినిమాలకు ఏ మాత్రం పోలిక ఉండదనేది వాస్తవం. రెండు సినిమాల నేపథ్యాలు వేరు. రెండు చిత్రాలు వేటికవే భిన్నమైనవి. దీంతో ప్రేక్షకులు రెండింటినీ ఎంజాయ్ చేసేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Leave a Reply