ఇంకా 13 రోజులే.. టాలీవుడ్‌లో సందడి ఏది?

Posted April 15, 2017

13 days more to bahubali 2 release
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం మరో 13 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను ఒక్క తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి పార్ట్‌ సాధించిన వసూళ్లను దృష్టి పెట్టుకుని మరింత భారీగా చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు దేశ వ్యాప్తంగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ సమయంలోనే తెలుగులో కాస్త అశ్రద్ద చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని భాషల్లో పబ్లిసిటీ భారీగా చేస్తున్న చిత్ర యూనిట్‌ సభ్యులు తెలుగులో మాత్రం ఇంకా పబ్లిసిటీ కార్యక్రమాలను ప్రారంభించింది లేదు.

‘బాహుబలి’ మొదటి పార్ట్‌ సక్సెస్‌ నేపథ్యంలో రెండవ పార్ట్‌పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దాంతో రెండవ పార్ట్‌కు తెలుగులో ఎక్కువ పబ్లిసిటీ అవసరం లేదని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు మరియు హిందీ వర్షన్‌లపై కాస్త ఎక్కువ దృష్టిని పెట్టినట్లుగా తెలుస్తోంది. చివరి వారం లేదా అయిదు రోజుల్లో తెలుగు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో యూనిట్‌ సభ్యులు పాల్గొనే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు. తెలుగు ఎలాంటి ప్రచారం లేకుండా విడుదలైనా కూడా ‘బాహుబలి’ మొదటి వారం రోజులు దుమ్ము రేపడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ఆ నమ్మకంతోనే ఇప్పుడు ‘బాహుబలి’ టీం ఇతర భాషలో దృష్టి పెట్టారు. వెయ్యి కోట్ల వసూళ్ల లక్ష్యంతో ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ప్రభాస్‌ ద్విపాత్రాభినయంలో నటించిగా అనుష్క, తమన్నా హీరోయిన్స్‌గా, రానా విలన్‌గా నటించిన విషయం తెల్సిందే. రెండవ పార్ట్‌లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగ ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

SHARE