బ్రహ్మి కొసం 15 లక్షల ఆఫర్

Posted November 15, 2016

15 Lakhs Offer For Brahmaanandamనవ్వుల రారాజు బ్రహ్మానందం ఈ మధ్య సినిమాల్లో కనిపించడం మానేశాడు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవడంలో విఫలమవుతున్న బ్రహ్మికి ఓ క్రేజీ ఆఫర్ తగిలిందట. గాలి జనార్థన్ రెడ్డి కూతురు బ్రహ్మణి పెళ్లికి టాలీవుడ్ అంతా కదిలి వస్తుంది. ఇప్పటికే ఈ ఈవెంట్ కు రకుల్, ప్రియమణిలతో డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నట్టు టాక్. అయితే అదే కాకుండా బ్రహ్మానందంతో ఓ స్పెషల్ కామెడీ షో ప్లాన్ చేస్తున్నారట.

దీని కోసం బ్రహ్మికి 15 లక్షల ఆఫర్ కూడా ఇచ్చారట. పెళ్లికి రావడమే కాదు స్టేజ్ మీద కాసిన్ని నవ్వులు పండిస్తే తగిన మొత్తం కూడా పొందే అవకాశం ఉందట. అయితే బ్రహ్మి మాత్రం ఈ ఆఫర్ ను ఓకే అనాలా లేదా అన్న ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం క్రేజ్ తగ్గిన బ్రహ్మి తనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్నాడు. టాలీవుడ్ మొత్తం కదిలి వస్తున్న ఈ ప్రోగ్రాంలో తన సత్తా చాటి మరోసారి అందరి దృష్టి పడాలని చూస్తున్నాడు బ్రహ్మానందం.

SHARE