17 ఏళ్ల క్రితం సినిమా ఇప్పుడు రిలీజ్‌

0
837
17 years ago the movie is now released

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ డబుల్‌ రోల్‌లో నటించిన ‘అభయ్‌’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయిన విషయం తెల్సిందే. అప్పట్లో ఆ సినిమాలో కమల్‌ రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఒక పాత్రలో విలన్‌గా నటించి యూనివర్శిల్‌ స్టార్‌ అనిపించుకున్నాడు. ఎలాంటి పాత్రలనైనా తనదైన శైలిలో రక్తికట్టించగల కమల్‌ హాసన్‌ అభయ్‌ సినిమాలో రెండు పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా కథ మరియు కథనంకు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాని సినిమా విడుదల సమయం సరిగా లేదో మరే కారణమో కాని కమర్షియల్‌గా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

రవీనా ఠాండన్‌, మనీషా కోయిరాల వంటి బాలీవుడ్‌ స్టార్స్‌ ఆ సినిమాలో నటించారు. వారి గ్లామర్‌ సినిమాకు అదనపు ఆకర్షణ. అదే సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఆ సినిమానే మళ్లీ రీ రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టైటిల్‌ మార్చడంతో పాటు చిన్న చిన్న ఎడిటింగ్‌లు చేసి సినిమాను రీ రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత కళ్లైపులి థాను రీమేక్‌కు ప్లాన్‌ చేస్తున్నాడు. తమిళనాడు వ్యాప్తంగా 500 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నాడు. తమిళంలో ఫలితం సాధిస్తే తెలుగులో కూడా విడుదల చేసే అవకాశాలున్నాయి.

Leave a Reply