టీడీపీలోకి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు?

0
582
2 congress mlcs joining tdp

Posted [relativedate]

2 congress mlcs joining tdpఏపీలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. అయితే ఈసారి వైసీపీ నుంచి కాకుండా.. కాంగ్రెస్ నుంచి ఈ వలసలు ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కబోతున్నారని టాక్. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎమ్మెల్సీల జాయినింగ్ కు ఓకే చెప్పేశారని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చంగల్రాయుడు, మహ్మద్ జానీలు హస్తానికి షాక్ ఇవ్వబోతున్నారని టాక్. ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో వీరిద్దరి మంతనాలు పూర్తయ్యాయట. ఇద్దరికీ క్లీన్ ఇమేజ్ ఉండడంతో .. వీరి రాకపై టీడీపీ నాయకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారట. అయితే ఫైనల్ గా ఈ ఇద్దరూ చంద్రబాబుతో భేటీ కానున్నారని సమాచారం.

ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీని వీడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఏపీ పీసీపీ చీఫ్ రఘువీరా రెడ్డి కూడా వారితో మాట్లాడారట. అయితే వారు వేసిన ప్రశ్నలకు రఘువీరా సమాధానం చెప్పలేకపోయారట. పార్టీలో ఉండడం వల్ల ఎలాంటి లాభం లేదని ఈ ఇద్దరు నాయకులు నిర్ణయించుకున్నారట. అందుకే సైకిల్ ఎక్కేందుకు గట్టిగా నిర్ణయించుకునేశారట. అయితే మొదట చంగల్రాయుడు టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారని టాక్. ఆ తర్వాత మహ్మద్ జానీ చేరబోతున్నారట. ఈ ఇద్దరి రాకతో టీడీపీకి మరింత ఉత్తేజం రావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.

అసలే ఏపీ శాసనసభలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేదు. ఈ ఇద్దరూ టీడీపీలోకి వచ్చేస్తే… శాసనమండలిలోనూ హస్తం ఆనవాళ్లు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడుతుంది. మరి ఈ ఇద్దరూ ఒకేసారి పార్టీ వీడుతారా? లేక ఒక్కరేపార్టీ వీడుతారా ? అన్నది చూడాలి.

Leave a Reply