జగన్ 2019 ప్లాన్ కి బ్రేక్?

 Posted November 7, 2016

2019 jagan plan got break
2019 ఎన్నికల కోసం వైసీపీ అధినేత జగన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు.2014 లో మోడీకి,ఆ తర్వాత నితీష్ కి వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్ సేవల కోసం ఎప్పుడో సంప్రదింపులు చేశారు.ఆయనకి భారీ ఆఫర్ ఇచ్చి 2019 లో వైసీపీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా ఉండేలా ఒప్పించినట్టు వార్తలు వచ్చాయి.అయితే అప్పటికే యూపీ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ అదే ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకుంటున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ వ్యూహాలపై కాంగ్రెస్ శ్రేణులు సంతృప్తిగా లేవని తెలుస్తోంది.యూపీ పరిస్థితుల్ని అర్ధం చేసుకోకుండా బీహార్ లో వలే మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నించడం,పార్టీ ముఖ్యుల్ని సంప్రదించకుండానే ములాయం,అమర్ సింగ్ లతో చర్చలు జరపడం ద్వారా ప్రశాంత్ వ్యవహార శైలిపై రాహుల్ కి ఫిర్యాదులు వెళ్లాయి. యూపీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సైతం ప్రశాంత్ వైఖరిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ లో అంతర్గత విబేధాలకు కారణమవుతున్న ప్రశాంత్ యూపీ ఎన్నికల బరిలో ఆ పార్టీ ప్రతిష్ట పెరిగే చర్యలేమీ తీసుకోలేకపోయారు.గెలుపు మాట పక్కనబెట్టి కనీసం గౌరవం దక్కే పరిస్థితి కూడా ఇప్పటికి కనపడ్డం లేదు.అక్కడ విఫలమైతే ఎన్నికల నిపుణుడిగా ప్రశాంత్ ప్రాభవానికి గండి పడినట్టే.అదే జరిగితే జీవన్మరణ సమస్య లాంటి 2019 ఎన్నికల్లో ఓ వైఫల్యం చవిచూసిన ప్రశాంత్ ని వ్యూహకర్తగా జగన్ పెట్టుకుంటారా? ఆ విధంగా చూస్తే జగన్ 2019 ఎన్నికల వ్యూహానికి బ్రేక్ పడినట్టే.

SHARE