రైల్లో కోట్లు మాయం ..దర్యాప్తు ముమ్మరం

0
457

  342 crores missed train
సంచలనం సృష్టించిన తమిళనాడు ట్రైన్ దోపిడి ఘటన దర్యాప్తు ముమ్మరం అయింది. పెద్ద ఎత్తున ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇంతవరకు ఇద్దరు పోర్టర్లను ఆదుపులోకి తీసుకున్నారు. రైలు బోగీలో లభ్యమైన నలుగురి వేలిముద్రలను సేకరించారు. బ్యాంకు కు సంభందించిన సోమ్ముతో ఆ రైలు చెన్నైకు వెళుతోంది. దాని చివరి బోగీలో డబ్బున్న బాక్సులు ఉన్నాయి. సుమారు రూ. 342 కోట్లు. చెన్నై వైపుగా దాని ప్రయాణం సాగుతోంది.

ఎగ్మూర్ లో ఆ డబ్బును స్వాధీనం చేసుకొనేందుకు ఆర్బీఐ అధికారులు కూడా రెడీగా ఉన్నారు. అంతా ఓకే.. ఫైన్ అనుకున్నారు. మంగళవారం ఉదయం ఎగ్మూర్ చేరుకుంది ట్రైన్.  ఆర్బీఐ అధికారులు ఆ బోగీలో ఉన్న డబ్బులు స్వాధీనం చేసుకోవడానికి లోపలికి వెళ్లారు. తీరా చూస్తే.. బోగీపై ఇద్దరు వ్యక్తులు పట్టేంత రంధ్రం కనిపించడంతో తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. నోట్ల కట్టలున్న బాక్సులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో.. తమ దగ్గరున్న పేపర్లలోని వివరాలతో పోల్చి చూశారు. మొత్తం 16 బాక్సులు పోయినట్టు తేలింది. దీంతో రైల్వేపోలీసులకు సమాచారం అందించారు.

ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అవన్నీ చినిగిపోయిన, మాసి, నలిగిపోయిన నోట్లే. ఈ విషయం ఆ దొంగలకు తెలుసో..లేదో.సినీ ఫక్కీలో జరిగిన ఈఇన్సిడెంట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బోగీకి రంధ్రం చేసి మొత్తం రూ.5.75 కోట్ల మేర దోచేశారు. తమిళనాడులోని సేలంకు చెందిన ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు అధికారులు చెన్నైలోని రిజర్వు బ్యాంకు అధికారుల దగ్గరకు ఈ నోట్లను తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. వివిధ బ్యాంకుల నుంచి సేకరించిన రూ.342 కోట్ల విలువైన పాత, చినిగిన కరెన్సీ నోట్లను 228 బాక్సుల్లో భద్రపరిచిన ఇండియన ఓవర్సీస్‌ బ్యాంక్‌ అధికారులు… ఎక్స్‌ప్రెస్‌ రైలింజిన్ వెనుక అమర్చిన గూడ్సు బోగీ ద్వారా చెన్నైకి పంపించారు.నిపుణులను రప్పించి బోగీపై ఉన్న చేతి వేలిముద్రలను సేకరించారు రైల్వే పోలీస్ అధికారులు.

సేలం నుంచి సోమవారం రాత్రి పది గంటలకు బయల్దేరిన ఆ రైలు మంగళవారం వేకువజామున 5 గంటలకు ఎగ్మూరు రైల్వేస్టేషన్ కు చేరింది. సేలం నుంచి వచ్చే మార్గంలో ఈ రైలు విరుదాచలం స్టేషనలో ముప్పావు గంటసేపు ఇంజన్ మార్పిడి కోసం ఆగుతుందని, ఆ సమయంలోనే దొంగలు ఈ దోపిడీకి పాల్పడి ఉంటారంటున్నారు. రాష్ట్ర పోలీసులతో సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply