మూడో టెస్ట్ లో పట్టుబిగించిన భారత్.. రెండు సెంచరీలు

  3rd test saha ashwin  centuries

కష్టాల్లో ఉన్న భారత్ ను గట్టెక్కించారు రవిచంద్రన్ ఆశ్విన్, వృద్ధిమాన్ సాహా. సెయింట్ లూసియాలో విండీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అద్భుతంగా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ సెంచరీలు కొట్టారు.. పెద్ద షాట్లకు పోకుండా ప్రతీ బంతినీ జాగ్రత్తగా ఆడారు. లంచ్ విరామం వేళకు ఆశ్విన్ 99. సాహా 93 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. అశ్విన్ 258 బంతుల్లోనూ, సాహా 208 బంతుల్లోనూ ఈ పరుగులు చేశారంటే ఎంత బాగా ఆడారో తెలుస్తుంది..ఇరువురూ కలిసి 204 పరుగులు జోడించారు. లంచ్ పూర్తయ్యాక ఆట మొదలయ్యే టైమ్ కు స్కోరు 5 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేశారు.

SHARE