4 కోట్ల లాస్ తెచ్చిందట..!

0
269
4 Crores Loss Srinivas Reddy Jayammu Nischayammuraa Movie

Posted [relativedate]

4 Crores Loss Srinivas Reddy Jayammu Nischayammuraa Movieఓ సినిమా రిలీజ్ కు ముందు ఎంత హడావిడి చేసినా బొమ్మ పడితే కాని దాని అసలు సత్తా ఏంటో తెలుస్తుంది. మా సినిమా అది మా సినిమా ఇది అంటూ మైకు పట్టి ప్రమోషన్స్ చేయడం వరకు బాగానే ఉంటుంది కాని అదే రేంజ్ కలక్షన్స్ మాత్రం రాబట్టడంలో విఫలమవడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం ప్రీ రిలీజ్ లో అదరగొట్టి అసలు సినిమాకు వచ్చేసరికి చతికిల పడ్డ జయమ్ము నిశ్చయమ్మురా పరిస్థితి అలానే ఉంది. ఓ బంగరు చిలక అంటూ ఓ సాంగ్ ప్రోమో వదిలి సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేసుకున్న దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి సినిమాను ప్రేక్షకులకు చేరువేయడంలో కాస్త తప్పటడుగులేశారు.

అదికాక నోట్ల రద్దు వల్ల సినిమాకు రావాల్సిన కలక్షన్స్ కూడా రాలేకపోయాయి. సో మొత్తానికి 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమా ఇప్పటిదాకా కేవలం 3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. అయితే దర్శక నిర్మాత రిలీజ్ కు ముందే సినిమా అమ్ముకున్నాడు. ఈ లాస్ ఎటుకూడి సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన వారికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్స్ హీరోగా మారితే ఒకప్పుడు పరిస్థితి ఏమో కాని ఇప్పుడు మాత్రం కాస్త కష్టంగానే ఉంది అన్నది తెలుసుకోవాల్సిన నిజం.

Leave a Reply