శ‌శిక‌ళ‌కు షాకిచ్చిన 40 మంది!!!

0
249
40 mlas gave shock to seshikala

Posted [relativedate]

40 mlas gave shock to seshikalaత‌మిళ‌నాడులో ఇప్పుడు ఎమ్మెల్యేల‌కు ఫుల్ డిమాండ్ వ‌చ్చేసింది. అటు శ‌శిక‌ళ‌-ఇటు ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాలు ఎమ్మెల్యేల వేట‌లో ఉన్నాయి. దొరికిన వారిని దొరికిన‌ట్టుగా క్యాంపులో దాచేస్తున్నాయి. అయితే 130 మంది ఎమ్మెల్యేలున్నార‌ని ప్ర‌చారం చేసుకున్న శ‌శిక‌ళ‌కు గ‌ట్టి షాక్ త‌గిలింద‌ని టాక్.

శ‌శిక‌ళ క్యాంప్ నుంచి రాత్రి 40 మంది ఎమ్మెల్యేలు జారిపోయార‌ట‌. వారంతా రాత్రికి రాత్రే అక్క‌డ్నుంచి … సెల్వం ద‌గ్గ‌ర‌కు చేరిపోయార‌ట‌. వారంద‌రూ ప్ర‌స్తుతం ర‌హ‌స్య ప్రాంతంలో ఉన్నార‌ని టాక్. గ‌వ‌ర్న‌ర్ అడిగితే ఆ 40 మందిని ఆయ‌న ఎదుట‌కు తీసుకొచ్చేందుకు సెల్వం సిద్ధంగా ఉన్నార‌ట‌.

ఒక్క‌సారిగా 40 మంది జారిపోవ‌డంతో శ‌శిక‌ళ బ్యాచ్ డీలా ప‌డిపోయింద‌ట‌. అటు డీఎంకే కూడా సెల్వంకే స‌పోర్ట్ చేసే అవ‌కాశం ఉండ‌డంతో ఇక ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ని టాక్. కానీ చిన్న‌మ్మ మాత్రం లాస్ట్ మినిట్ వ‌ర‌కు పోరాటం చేద్దామ‌ని డిసైడ్ అయిపోయార‌ట‌. ఉన్న‌వాళ్ల‌నైనా కాపాడుకుంటే క‌నీసం ప్ర‌తిఘ‌ట‌న అయినా చేయొచ్చ‌న్న‌ది ఆమె వ్యూహ‌మ‌ట‌.

శ‌శిక‌ళ క్యాంపులో ఇప్పుడున్న వారిలో కొంత‌మంది ఎమ్మెల్యేలు కూడా సెల్వంకే సపోర్ట్ చేస్తార‌ట‌. పేరుకే చిన్న‌మ్మ వ‌ర్గంలో ఉన్నార‌ట‌. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు సెల్వంపై స్వామిభ‌క్తిని చాటుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై శ‌శిక‌ళ‌కు కూడా స‌మాచారం ఉంద‌ట‌. కానీ ఈ ప‌రిస్థితుల్లో మ‌రో దారి లేదు. కాబ‌ట్టి మ‌మ అనిపించేస్తున్నార‌ట‌. రెండు వ‌ర్గాల మ‌ధ్య పోరు చూస్తుంటే.. మ్యాజిక్ ఫిగ‌ర్ కోసం లాస్ట్ ఓవ‌ర్ లాస్ట్ బాల్ వ‌ర‌కు రెండు వ‌ర్గాలు రాజీ లేని పోరు చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి. మ‌రి విజయం ఎవ‌రిదో… త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Leave a Reply