ఒక్క పాటకి 400 మంది ఏంటి బోయపాటి..??

Posted February 7, 2017

400 members ina song for boyapati movie
సింహ , లెజెండ్ , సరైనోడు సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ ను సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటువంటి భారీ బడ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహించి మాస్ ఆడియన్స్ లలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సాధించాడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఈ మాస్ డైరెక్టర్… బెల్లం కొండ శ్రీనివాస్ తో ఓ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా శ్రీనివాస్ ను మాస్ హీరో చేయాలనే ప్రయత్నం లో ఖర్చుకు వెనకడుగు వెయ్యకుండా భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ , ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సంగీత్ నేపథ్యంలో సాగే ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం భారీ ఎత్తున ప్లాన్ చేసాడు బోయపాటి. దాదాపు 400 వందల మందికి పైగా ఈ పాటలో కనిపించబోతున్నారట. వీళ్లందరినీ ముంబై, హైదరాబాద్ నుండి బ్యాంకాక్ తీసుకెళ్లారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది సినీ విశ్లేషకులు ఎంత భారీ బడ్జెట్ అయితే మాత్రం ఓ పాటలో కనిపించే రెండు మూడు సీన్ల కోసం 400 మంది ఏంటి అని విమర్శిస్తున్నారు.

SHARE