శశికి పాంచ్ పంచ్…

Posted February 12, 2017

5 ministers out from seshikala party
చిన్నమ్మకి కాలం ఎదురుతిరిగినట్టుంది.ఆమె స్వయంగా గోల్డెన్ బే రిసార్ట్ కి వెళ్లి మరీ తన వర్గం ఎమ్మెల్యేల్లో విశ్వాసం పాదుకొల్పడానికి ప్రయత్నించినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండాపోయింది. ఆమె సీనియర్ నేత సెంగోట్టైన్ తో పాటు వెళ్లినా ఆమె నాయకత్వం మీద నమ్మకం కలగలేదు.ఆమె రిసార్ట్ నుంచి వెళ్ళిపోయినవెంటనే ఓ ఐదుగురు మంత్రులు శశికళ క్యాంపు నుంచి అదృశ్యమయ్యారు.వీరు ఇప్పటికే పన్నీర్ సెల్వం తో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.వారిని తిరిగి తమ గూటికి తెచ్చేందుకు శశి గ్రూప్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయట.

ఇంతకుముందు తగిలిన షాక్ ల కన్నా తాజా పాంచ్ పంచ్ తో శశి డీలా పడ్డారట.అందుకు కారణం శశికి తాజాగా హ్యాండ్ ఇచ్చిన మంత్రులంతా ఆమె క్యాంపు లో 24 గంటల ముందు కీలక పాత్ర పోషించిన వాళ్ళు కావడమే.అటవీశాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్,పాడి డైరీ శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ,విద్యుత్ శాఖ మంత్రి తంగమణి,పురపాలక శాఖ మంత్రి వేలుమణి,గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి బెంజిమన్…ఈ ఐదుగురు శశికి తాజాగా పాంచ్ పంచ్ ఇచ్చిన మంత్రులు.వీరితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు,ఎంపీ లు చిన్నమ్మకి ఝలక్ ఇచ్చి పన్నీర్ గూటికి చేరేందుకు తహతహలాడుతున్నారు.

SHARE