5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే..

0
324
5 states elections schedule

Posted [relativedate]

5 states elections scheduleదిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. శాసనసభ గడువు ముగియడంతో ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా,పంజాబ్‌, మణిపూర్‌ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం అహ్మద్‌ జైదీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నియమావళి నేటి నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల్లోనూ మార్చి 11న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు అదేరోజు ప్రకటించనున్నారు.

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా.. 

ఉత్తర్‌ప్రదేశ్‌ 
403 స్థానాల్లో 7 విడతలుగా పోలింగ్‌ 

 • తొలి విడత : ఫిబ్రవరి 11(73స్థానాలు) 
 • రెండో విడత: ఫిబ్రవరి 15(67 స్థానాలు) 
 • మూడో విడత: ఫిబ్రవరి 19(69 స్థానాలు) 
 • నాలుగో విడత: ఫిబ్రవరి 23(53 స్థానాలు) 
 • ఐదో విడత: ఫిబ్రవరి 27( 52 స్థానాలు) 
 • ఆరో విడత: మార్చి 4(49 స్థానాలు) 
 • ఏడో విడత: మార్చి 8( 40 స్థానాలు)

  పంజాబ్‌ 

 • నోటిఫికేషన్‌ తేదీ: జనవరి 11 
 • పోలింగ్‌ తేదీ: ఫిబ్రవరి 4

గోవా 

 • * నోటిఫికేషన్‌ తేదీ: జనవరి 11 
 • * పోలింగ్‌ తేదీ: ఫిబ్రవరి 4

మణిపూర్‌ 
రెండు విడతల్లో పోలింగ్‌ 

 • తొలి విడత : మార్చి 4(38స్థానాలు) 
 • రెండో విడత మార్చి 8(22 స్థానాలు)

ఉత్తరాఖండ్‌ 

 • నోటిఫికేషన్‌ తేదీ: జనవరి 20 
 • పోలింగ్‌ తేదీ: ఫిబ్రవరి 15

ముఖ్యాంశాలు 

 • మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు 
 • ఐదు రాష్ట్రాల్లో మొత్తం ఓటర్లు 16కోట్ల మంది 
 • ఐదు రాష్ట్రాల్లో లక్షా 85వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు 
 • ఓటర్‌ స్లిప్పులను ఎన్నికల సంఘమే పంపిణీ చేస్తుంది. 
 • కొత్త ఓటర్లకు కూడా ఫోటో గుర్తింపు కార్డులు జారీ 
 • అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు వినియోగం 
 • ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే వెసులుబాటు 
 • అభ్యర్థుల అఫిడవిట్‌లో కొన్ని మార్పులు 
 • ఎన్నికల ప్రచారంలో పర్యావరణ హిత సామాగ్రినే వాడాలి. 
 • ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.28లక్షలు, గోవా, మణిపూర్‌లో అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.20లక్షలు. ఫలితాలు వెలువడిన 30 రోజుల్లోగా వివరాలు తెలియజేయాలి. 
 • అభ్యర్థుల విరాళాలు రూ.20వేలు దాటితే చెక్కు రూపంలో స్వీకరించాలి.Kp

Leave a Reply