Thursday, September 23, 2021
Homelatestజనసేనలోకి సుమన్?

జనసేనలోకి సుమన్?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాజాకీయాల్లోకి వస్తా వస్తా అంటూ ఎప్పటినుంచో చెబుతున్న సినీ నటుడు సుమన్ దృష్టి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన మీద ఉందా? సుమన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఈ మాట నిజమే అనిపిస్తోంది.ఇటీవల అనారోగ్యం పాలైన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీని సుమన్ పలాసలోనే పరామర్శించారు.ఈ సందర్భంగా రాజకీయ రంగప్రవేశం గురించి తన మనసులో మాట బయటపెట్టారు సుమన్.ఏదైనా మంచి పార్టీ వస్తే అందులో జేరతా అని సుమన్ చెప్పారు.అంటే ఇప్పుడున్న పార్టీల్లో చేరిక ఆయనకి ఇష్టం లేదనే అనుకోవాలి. జనసేన కూడా రాజకీయ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ఇంకా దాని కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలు కాలేదు.దాన్ని దృష్టిలో ఉంచుకునే సుమన్ ఈ మాట అని ఉండొచ్చని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.

అటు జనసేన కూడా తన పార్టీలోకి క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే అవకాశం ఇద్దామని భావిస్తోంది. ఈ క్రమంలో కిందిస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తోంది.పైస్థాయిలో కూడా ఏదో ఒక ఫిల్టరింగ్ తర్వాతే అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ వ్యవహారాన్ని సగటు రాజకీయనాయకుడు సానుకూలంగా తీసుకునే అవకాశాలు తక్కువే.ఈ పరిస్థితిని పవన్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.కానీ సుమన్ లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తానంటే ఇలాంటి అభ్యంతరాలు ఉండవేమో.

- Advertisment -
spot_img

Most Popular