Wednesday, December 8, 2021
Homelatestటంగ్ స్లిప్పైన కేటీఆర్

టంగ్ స్లిప్పైన కేటీఆర్

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అధికారంలో ఉన్నవాళ్లు ఆచితూచి మాట్లాడారు. రైతుల కోసం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నామంటూ గొప్పలు చెప్పిన కేటీఆర్.. ఖమ్మంలో మిర్చి రైతుల ఘటన సంగతి మరిచిపోయారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం దండగలా సాగిందని, కానీ తాము వచ్చాక వ్యవసాయాన్ని పండగ చేస్తున్నామని చిన్నదొరవారు సెలవిచ్చారు.

అంత పండగలా ఉంటే తెలంగాణలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. అంతెందుకు నిన్న గాక మొన్న ఖమ్మంలో గిట్టుబాటు ధర అడిగినందుకు మిర్చి రైతులకు బేడీలు వేయించిన ఘనులు కేటీఆర్ తండ్రి కేసీఆర్. అంత చిత్తశుద్ధి ఉంటే ఖమ్మం మార్కెట్ యార్డుకు వెళ్లి అన్నదాతలకు నచ్చజెప్పొచ్చు కదా అంటే ఉలకరు. పలకరు.

అధికారంలో ఉండి చేయాల్సిన పనులు చేయకుండా.. మాట్లాడితే యాభై ఏళ్ల దరిద్రం అప్పుడే పోతుందా అంటూ టీఆర్ఎస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఉద్యమకారులు కూడా భావిస్తున్నారు. ఇప్పుడు మరోసారి కేటీఆర్ నోరు జారడం కోరి కొరివితో తల గోక్కున్నట్లైంది. ఇప్పటికైనా కేటీఆర్ రైతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయంలో హరీష్ సూచనలు తీసుకోవాలని గులాబీ క్యాడర్ కోరుతోంది.

- Advertisment -
spot_img

Most Popular