మోడీకి 8 వ తరగతి పిల్లోడి ఝలక్ ..

 8 class boy devansh jain wrote letter modi shocked
ఓ పిల్లోడి చదువు ముఖ్యమా? ప్రధాని సభ ముఖ్యమా? దీనికి మీ జవాబు ఏదైనా కావొచ్చు ..ఆ పిల్లాడికి మాత్రం తన చదువే ముఖ్యం అనిపించింది.అందుకే తన స్కూల్ బస్సు ని ప్రధాని సభకు పంపడాన్ని ఒప్పుకోలేకపోయాడు.దాని కోసం స్కూల్ కి సెలవు ఇవ్వడం సరికాదనుకున్నాడు.అనుకుని ఊరుకోలేదు ..వెంటనే ప్రధానికి లేఖ రాశాడు.నా స్కూల్ కన్నా ..మీ సభ ముఖ్యమా అని ప్రధానిని ప్రశ్నించాడు .ఆ పిల్లాడికి సోషల్ మీడియా తోడైంది .ఆ లేఖ ప్రతులు అంతటా వ్యాపించాయి .అధికారులు వెంటనే స్పందించి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు .స్కూల్ బస్సు ని ర్యాలీకి వాడబోమని చెప్పారు .

ఇంతకీ ఆ కుర్రోడి పేరేంటో తెలుసా ..దేవాన్ష్ జైన్ ..సభకు వస్తున్న ప్రధాని మోడీ ..చంద్రశేఖర్ ఆజాద్ స్వగ్రామం భభ్రలో నిర్వహించే సభకు మోడీ వెళ్తున్న సందర్భంగా జరిగిందీ ఘటన .

SHARE