టెన్త్ విద్యార్హతతో 8 వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు…!

263

Posted [relativedate]

8 thousand jobs to 10th passedకేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న 8300 ఉద్యోగాలని భర్తీ చేయుటకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ జారీ చేసింది, అన్ని రాష్ట్రాలలో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్- టెక్నికల్) విభాగంలో భారీ ఎత్తున కొలువులని ప్రకటించింది, ఈ ఉద్యోగాలకి పదవ తరగతిని విద్యార్హతగా ప్రకటించారు, ఈ ఉద్యోగాలకి అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు, Ex – Servicemen , మహిళ అభ్యర్థులకి దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు ఉంది, ఏప్రిల్, మే నెలలలో జరిగే రాత పరీక్ష ద్వారా ఉద్యోగులని ఎంపిక చేస్తారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో గ్రూప్- C కేటగిరీలో ఉండే ఈ ఉద్యోగులు మొదటి నెలలోనే దాదాపు 18 వేల రూపాయల జీతం అందుకునే ఆవకాశం ఉంది.

ఈ ఉద్యోగులకి అప్లై చేయాలనుకుంటే ssconline.nic.in అనే వెబ్ సైట్ లో ముందుగా రిజిస్టర్ అవ్వాలి.రిజిస్ట్రేషన్ తరువాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయ్యి అప్లికేషన్ పార్ట్ ని పూర్తి చెయ్యాలి, ఆ తరువాత పేమెంట్ పార్ట్ ని పూర్తి చెయ్యాలి.జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100 .అప్లికేషన్స్ చివరి తేదీ: 30/01/2017పరీక్ష తేదీలు:  16.04.2017,  30.04.2017,  07.05.2017.

Note: మరిన్ని వివరాలకి SSC బోర్డు విడుదల చేసిననోటిఫికేషన్ ని  చూడండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here