ఈయన వల్లే ఆదివారం సెలవు ..

 Posted October 24, 2016

8 years fight for sunday holiday by narayan moghjiఆదివారం హాయిగా సెలవు రోజుని ఎంజాయ్ చేస్తున్నారా? అయితే మీ ఎంజాయ్ మెంట్ కోసం ఓ వ్యక్తి 8 ఏళ్ళకిపైగా పోరాడితే గానీ ఆదివారం సెలవు రాలేదు.ఇంతకీ అయన ఎవరో తెలుసా? నారాయణ్ మేఘాజీ లోఖండే..అప్పట్లో బ్రిటిష్ వారు భారతీయ ఉద్యోగులు,కార్మికులతో సెలవనేది లేకుండా అన్ని రోజులు పని చేయించుకునేవారు.

నారాయణ్ మేఘాజీ సెలవు కోసం అడిగితే బ్రిటిష్ అధికారుల్ని అడిగితే వాళ్ళు హేళన చేసేవాళ్ళు.అయినా మేఘాజీ నమ్మకం కోల్పోకుండా అందర్నీ కూడగట్టుకుని ఆదివారం సెలవు కోసం తనకు తెలిసిన పద్ధతుల్లో ఆంగ్లేయులపై ఒత్తిడి తెస్తూనే ఉండేవారు.1881 నుంచి ఈ డిమాండ్ సాధించుకోడానికి 8 ఏళ్లపాటు మేఘాజీ పోరాడారు.దాంతో బ్రిటిష్ వారు దిగొచ్చి 1889 లో వారంలో ఒకరోజు ఆదివారం సెలవు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.

SHARE