ఏపీ లో 9 కొత్త మండలాలు…

   Posted January 9, 2017

9 new mandals in andhrapradeshరాష్ట్రంలో మరో తొమ్మది కొత్త మండలాలను కూడ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి.నూతన మండలాలను ఏర్పాటు చేసేందుకు పభుత్వం క్షేత్రస్దాయి  నుంచి గణాంకాలను కూడ సేకరిస్తోంది. ఆర్దిక భారం పెరుగుతుందని ఆర్దిక శాఖ అభ్యంతరాలు లేవనెత్తినా పట్టించుకోని రెవెన్యూ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇటీవల మంత్రివర్గం 18 కొత్త రెవెన్యూ డివిజన్లకు సూత్రపాయంగా అంగీకరించింది. ఇదే సమయంలో తాజాగా తొమ్మది మండలాల ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. రాజధాని జిల్లాలోనే నాలుగు మండలాలు ఏర్పాటు కానున్నాయి. కృష్ణ జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో ఒకటి , విశాఖ జిల్లాలో మూడు, నెల్లూరు కర్నూలు జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయాలని ప్రతిపాధిస్తున్నారు. ఈ ప్రతిపాధనలో ఏడు మండలాలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.కృష్ణా, విశాఖలో ఒక్కో మండలానికి ప్రతిపాదనలు పెండింగ్ లో వున్నాయి. మండలాల పరిధిలో ఏర్పాటు చేయావలసిన పోలీస్ స్టేషన్లు , అవి ఏ సర్కిల్, సబ్ డివిజన్ పరిధిలోకి తసీుకురావాలన్న ప్రతిపాదనలపై కూడ వివరాలు కూడ ఆయా శాఖ ల నుండి రెవెన్యూ శాఖ సేకరిస్తోంది..

SHARE