వాస్తవఘటనల ఆధారంగానే “శమంతకమణి”

0
665
aadi nara rohit sudheer babu sundeep kishan samanthakamani multi starrer movie

Posted [relativedate]

aadi nara rohit sudheer babu sundeep kishan samanthakamani multi starrer movieయంగ్ స్టర్ హీరోసైన సందీప్ కిషన్, నారా రోహిత్, సుధీర్ బాబు, ఆది లు ఓ మల్టీస్టారర్ లో నటించనున్నారన్న సంగతి తెలిసిందే. భలేమంచిరోజు  ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  కాగా ఈ ప్రాజెక్ట్ గురించిన ప్రకటన వచ్చినప్పటి నుండి అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇంతమంది హీరోలున్న ఈ మల్టీస్టారర్ స్టోరీ ఎలా ఉండనుందోనని ఫిల్మ్ నగర్ వర్గాలు కూడా చాలా ఆత్రుతగా ఎదరుచూస్తున్నారు.

ఆ ఆసక్తిని మరింత పెంచడానికి సినిమా కధ ఎలా ఉండబోతోందో చిత్రయూనిట్ తెలిపింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని వివరించింది. కధ చాలా డిఫరెంట్ గా, కొత్తదిగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.  సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు శమంతకమణి అనే పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోలు నలుగురు ఉన్నా హీరోయిన్ మాత్రం ఒక్కరే ఉంటారట. మరి నలుగురి హీరోల సరసన నటించే ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply