పవన్ కి విలన్ దొరికేశాడు..

Posted March 28, 2017

aadi pinisetty as villain in pawan kalyan trivikram movieమార్చి 24న ప్రపంచవ్యాప్తంగా కాటమరాయుడు సినిమాను రిలీజ్ చేసి ఓ రేంజ్  హిట్ కొట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక  నెక్ట్స్ సినిమా  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్లు పవన్ కాటమరాయుడు రిలీజ్ కి ముందుగానే ప్రకటించాడు. ప్రకటించిన  విధంగానే ఆ సినిమాను లైన్ లో పెట్టేశాడు. త్రివిక్రమ్ కూడా ఈ మేరకు స్క్రిప్ట్ ని రెడీ చేసేశాడు. దేవుడే దిగివచ్చినా అనే టైటిల్ పరిశీలనలో ఉన్న  ఈ సినిమా వచ్చే నెల అంటే ఏప్రిల్ 6 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. మరోపక్క త్రివిక్రమ్ క్యాస్టింగ్ ని కూడా ఫైనల్ చేస్తున్నాడు. సరైనోడు సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టిని ఈ సినిమాలో కూడా విలన్ గా ఎంచుకున్నాడు త్రివిక్రమ్.

పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో  తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటించనున్నాడు. కాగా విలన్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో చాలామందిని పరిశీలించిన త్రివిక్రమ్  ఆదిని ఎంపిక చేశాడట. అలానే పవన్‌ సరసన కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యుల్‌ నటిస్తుండగా, ఖుష్బూ, మోహన్‌లాల్‌ ప్రధానపాత్రల్లో  కనిపించనున్నారు.  కాగా పవన్ సినీ కెరీర్ తో పాటు రాజకీయ ఎంట్రీని  కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట మాటల మాంత్రికుడు. ఇప్పటికే పవన్ మీటింగ్ లన్నింటికీ త్రివిక్రమే డైలాగ్స్ రాస్తాడన్న రూమర్ ఉంది. పవన్ రాజకీయ ఎంట్రీని  దృష్టిలో పెట్టుకుని చేసే ఈ సినిమాతో ఎలాంటి రూమర్స్ వస్తాయో చూడాలి మరి.

SHARE