చెర్రీకి బ్రదర్ గా బన్నీ విలన్

0
525
aadi pinisetty to do ram charan brother in sukumar movie

Posted [relativedate]

aadi pinisetty to do ram charan brother in sukumar movieఒకప్పటి హీరోలు కొంతమంది విలన్ అవతారాలెత్తి విజయాన్ని సాధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో హీరో కూడా విలన్ గా మారిపోయాడు. ఒక విచిత్రం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు ఆది పినిశెట్టి.  ఆ సినిమా అంతగా విజయం సాధించకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ స్టార్ గా మంచి పేరు  సంపాదించుకున్నాడు.

 ఈ హీరో కోలీవుడ్ కి వెళ్లినా అడపాదడపా గుండెల్లో గోదారి, వైశాలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. అయితే దాదాపు అన్ని  సినిమాల్లోనూ  హీరోగా చేసిన ఆది.. ఇటీవల సరైనోడు సినిమాలో మాత్రం విలన్ గా కూడా నటించాడు. నటించి మెప్పించాడు. కాగా బన్నీ సినిమాలో విలన్ గా నటించిన ఇతనికి ఇప్పుడు రామ్ చరణ్ కి బ్రదర్  గా నటించే అవకాశం వచ్చిందట.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చెర్రీకి బ్రదర్ గా  ఆదిని సెలెక్ట్ చేశాడట సుకుమార్. మరి హీరోగా, విలన్ గా గా తన కెరీర్ ని నెట్టుకొస్తున్న ఆది ఇందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి. 

Leave a Reply