మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాదు.. మిస్టర్‌ కుళ్లుబోతు

0
572
aamir khan comment about on bahubali 2 movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

aamir khan comment about on bahubali 2 movie
‘బాహుబలి’ సినిమాపై దేశ వ్యాప్తంగా ప్రేక్షకు మరియు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాని బాలీవుడ్‌ ఖాన్స్‌ త్రయం మాత్రం మన సినిమా గురించి మాట్లాడటలేదు. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ అయినా ఈ సినిమా గురించి పాజిటివ్‌గా స్పందిస్తాడని అనుకున్నారు. కాని విడుదలైన 10 రోజుల వరకు అమీర్‌ ఖాన్‌ కూడా నోరు ఎత్తలేదు. వెయ్యి కోట్లు వసూళ్లు సాధించిన తర్వాత కూడా అమీర్‌ ఖాన్‌ స్పందించలేదు. ఎట్టకేలకు స్పందించిన అమీర్‌ ఖాన్‌ తనలో ఉన్న కుళ్లును అంతా బయట పెట్టాడు. తన సినిమాల కంటే ‘బాహుబలి 2’ ఎక్కువ కలెక్షన్స్‌ను సాధించిందనే అక్కస్సు ఆయన మాటల్లో క్లీయర్‌గా అర్థం అయ్యింది.

తాజాగా అమీర్‌ ఖాన్‌ ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ‘బాహుబలి 2’ భారీ వసూళ్లు సాధించినందుకు సంతోషం. అయితే ప్రస్తుతం తాను చేయబోతున్న సినిమా ఆ సినిమా స్థాయిని మించి ఉంటుందని, భారీ వసూళ్లను సాధించడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు. ‘ధూమ్‌ 3’ చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్‌ కృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం అమీర్‌ ఖాన్‌ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాను దాదాపు 500 కోట్లతో తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి 2’ రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ఆ సినిమాను అమీర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నట్లుగా ఆయన మాటల్లోనే అర్థం అవుతుంది. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరున్ను అమీర్‌ ఖాన్‌ ఇలా మిస్టర్‌ కుళ్లుబోతుగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. సినిమాల్లో పోటీ అనేది ఉండాలి. కాని ఒక గొప్ప సినిమాను ఇలా మాట్లాడటం కరెక్ట్‌ కాదు అంటూ సినీ ప్రముఖులు సైతం అమీర్‌ తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply