దంగల్ లో అమీర్ పెద్ద కూతురు ఎవరో తెలుసా?

0
617
Aamir Khan Dangal Daughters Fatima Sana Shaikh

Posted [relativedate]

Aamir Khan Dangal Daughters Fatima Sana Shaikh
అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. ఆ సినిమా సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. 500 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు పెడుతోంది. సినిమాలో అమీర్ నటన చూసి సూపబ్ అని వారు లేరు. అంతేకాకుండా ఈ సినిమాలో అమీర్ కూతుళ్ల యాక్టింగ్ కి కూడా ఫిదా అయిపోయారు అభిమానులు. ఇక అసలు విషయానికొస్తే… అమీర్ ఖాన్ పెద్ద కూతురు గీత పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో తెలిస్తే మాత్రం కాస్త ఆశ్చర్యం కలగక తప్పదు.

ఆ అమ్మాయి పేరు ఫాతిమా సనా షేక్. ఆ అమ్మాయి ఎవరో కాదు… కమల్ హాసన్, టబు హిందీలో నటించిన చాచీ 420 సినిమాలో కమల్ కి కూతురుగా నటించిన పిల్లే. ఆ తర్వాత ఆ అమ్మాయి తహాన్, బిట్టూ బాస్, ఆకాశ్ వాణీ వంటి పలు సినిమాల్లో కూడా నటించింది. సినిమాలతో పాటు … అగ్లే జన్మ్ మోహే బిటియా కీ జో.. అనే హిందీ సీరియల్ లో బుల్లితెరపై కూడా మెరిసింది.

Leave a Reply