కొత్తలుక్ లో ఆశ్చర్యపరుస్తున్న అమీర్ ఖాన్..!!

0
558

Posted [relativedate]

 

aamir-khan-new-look-in-thugs-of-hindustan

బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ఎంతటి విజయాన్ని సొంతంచేసుకుందో, ఎన్ని కోట్లు వసూలు చేసిందో అందరికీ తెలిసిందే. తన కూతుళ్ల భవిష్యత్తును తీర్ది దిద్దే తండ్రిగా అమీర్ నటన అద్భుతమనే చెప్పాలి. అంతేకాకుండా వయసుకు తగ్గట్టు అమీర్ నటనతో పాటు బాడీలో కూడా వేరియేషన్స్ చూపించాడు. యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, సీనియర్ సిటిజన్ ఏజ్ ఇలా రకరకాల లుక్స్ లో ప్రేక్షకులను మెప్పించడానికి అమీర్ జిమ్ లో చాలానే వర్కౌట్స్ చేశాడు. ఇప్పుడు తాజాగా మరో డిఫరెంట్ లుక్ లో సందడి చేస్తున్నాడు.  

విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కనున్న తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో అమీర్ లుక్ కి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ లుక్ లో అమీర్ ని చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయిన అమీర్ ఈ వయసులో కూడా తన పాత్రకు తగ్గట్టుగా తన బాడీని మార్చుస్తున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply