“సెల్యూట్”  చేయనున్న అమీర్ ఖాన్

0
303
aamir khan next movie salute

Posted [relativedate]

aamir khan next movie saluteబయోపిక్ ల హవా నడుస్తున్న బాలీవుడ్ లో ఇటీవల రిలీజైన దంగల్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతాకాదు. ఈ చిత్రం అందించిన జోష్ తో అమీర్ ఖాన్ మరో బయోపిక్ కి శ్రీకారం చుట్టాడు. వ్యోమగామి రాకేశ్ శర్మ జీవితం కధ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయాత్నాలు జరుపుతున్నాడు.

ప్రస్తుతం అమీర్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌తో కలిసి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీని  తర్వాత ఈ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లనుంది. అంతరిక్షంలో భారత జెండాను రెపరెపలాడించిన రాకేశ్ శర్మ  బయోపిక్ లో అమీర్ ఖానే .. రాకేశ్ శర్మగా నటించనున్నాడు. ఈ చిత్రానికి సెల్యూట్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్, అమీర్ ఖాన్ ఈ సినిమను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్కే ఫిల్మ్స్ అనే కొత్త బ్యానర్‌ పై నిర్మించే ఈ చిత్రం 2018లో ప్రారంభం కానుందని  సమాచారం.

 

Leave a Reply