టీడీపీలోకి మోడీ …ఆప్ లోకి అమిత్ షా?

0
343
AAP party leaders kumar vishwas says modi join tdp party amit shah join congress party

Posted [relativedate]

AAP party leaders kumar vishwas says modi join tdp party amit shah join congress party
ప్రధాని నరేంద్ర మోడీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? ఎవరికీ రాని ఈ సందేహం ఓ పార్టీ కీలక నేతలకి వచ్చేసింది.ఇంతకీ ఆ డౌట్ వచ్చింది ఎవరికంటే ..మోడీ మీద నిత్యం నిప్పులు కురిపించే ఆప్ నేతలకి.ఇది పచ్చి అబద్ధమని తెలిసినా వాళ్ళు ఇలా మాట్లాడడానికి ఓ కారణం వుంది.

ఆప్ అధినేత,ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ప్రధాన అనుచరుల్లో ఒకరు కుమార్ విశ్వాస్.అయన ఆప్ ని వదిలి బీజేపీ లో చేరతారని రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా గుప్పుమంటోంది. ఈ వార్తలు పుట్టిస్తోంది బీజేపీ అని కుమార్ విశ్వాస్ డౌట్ .అందుకే అయన వెరైటీ గా కౌంటర్ ప్లాన్ చేశారు.ప్రధాని మోడీ ఏపీలో అధికారంలో వున్న టీడీపీ లో చేరబోతున్నారని సెటైర్ వేశారు.పైగా ఈ వార్తని సాధ్యమైనంత వేగంగా ప్రచారం చేయాలని కూడా కోరారు.అంతలోనే మీలాగే నేను కూడా జోక్ చేస్తున్నా అంటూ ఎపిసోడ్ కి ముగింపు ఇచ్చారు.ఇక మోడీ తన భజనపరులకి సెన్స్ అఫ్ హ్యూమర్ పెంచుకోమని చెప్తుంటే వాళ్ళు సెన్స్ అఫ్ రూమర్ పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.ఇక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇంకాస్త ముందుకెళ్లి మోడీ కాంగ్రెస్ లో చేరిపోతారని చెప్పారు.ఇంకో ఆప్ మంత్రి కపిల్ మిశ్రా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ని టార్గెట్ చేశారు.అయన ఆప్ లో చేరతారా ?అని కపిల్ మిశ్రా అస్త్రం సంధించారు.ఇంతకీ ఆప్ కోపం సోషల్ మీడియా మీదా ?లేక దాన్ని వాడుకుని బీజేపీ పుకార్లు పుట్టిస్తోందని కోపమా ? ఏదేమైనా ఆప్ నేతల వ్యాఖ్యలు మంచి కామెడీ పండించాయి.

Leave a Reply