పంజాబ్ అసెంబ్లట్ ఎన్నికలు ఇంకా ఏడెనిమిది నెలలు ఉండగానే ఓ పీనియన్ పోల్స్ సందడి మొదలైంది. ఇంతక ముందు వచ్చిన పీనియన్ పోల్స్ ఫలితాలు చాలా మందికి షాక్ ఇచ్చాయి. VDP అసోసియేట్స్ అనే సంస్థ నిర్వహించిన పోల్ ‘పంజాబ్’ ఆప్’ వశం కాబోతుందని స్పష్టం చేసింది.
మొత్తం 117 స్థానాలలో 100 చోట్ల ఆప్ అభ్యర్థులు జయకేతనం ఎగరేస్తారని VDP తెలిపింది. 12 స్థానాలలో అకాలీదళ్ రెండో స్థానం, కేవలం మూడు సీట్లతో కాంగ్రెస్ మూడోస్థానం, ఒక్క స్థానాన్ని గెల్చుకొని బీజేపీ నాలుగో స్థానంలో నిలుస్తాయని ఆ సంస్థ సర్వేలో వెల్లడైంది.
వాస్తవ ఫలితాలు ఇదే సరళిలో ఉంటే నరేంద్ర మోడీ మరోసారి కేజ్రీ చేతిలో అవమాన భారంతో కుంగిపోక తప్పదు. అకాలీదళ్ కూడా ఆ అవమాన భారాన్ని కాస్త పంచుకుంటుందంటే .. ఇక కాంగ్రెస్ పరిస్థితి నిండా మునిగిన వాడికి చలేంటన్న చందంగా తయారవుతుంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ లకు ఊరట నిచ్చే అంశం ఒకటుంది.. అదేంటంటే తాము ఓడిపోయిన తమ ప్రధాన ప్రత్యర్థులు గెలవకపోవటమే … ఏదేమైనా ఆప్ చీపురు పంజాబ్ ను కూడా ఊడ్చేస్తే దేశంలో సరికొత్త రాజకీయాలు మొదలైనట్టే…
VDP అసోసియేట్స్ ఓ పీనియన్ పోల్ నిజమైతే దేశంలో సాంప్రదాయ రాజకీయ విధానాలకు ఫుల్ స్టాప్ పడినట్టే.. అయితే ఓ పీనియన్ పోల్ ని.. వాస్తవ ఎన్నికలకు మధ్య ఇంకా ఏడెనిమిది నెలలు టైంఉంది … భావోద్వేగ ప్రధానం గా భారత రాజకీయాలు నడుస్తున్నందున.. ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు..