‘ఆటాడుకుందాం రా’ ఆదిత్యా హక్కు…

0
440
aata1
అక్కినేని నాగార్జున గారి మేనల్లుడు సుషాంత్ హీరో గా నటిస్తోన్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’. ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్యా మ్యూజిక్ కైవసం చేసుకుంది. చింతలపూడి శ్రీనివాస రావు మరియు నాగ సుశీల నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో హక్కులను దక్కించుకోవటం ఎంతో ఆనందం గా ఉంది అని ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి తెలిపారు. సినీ సంగీత ప్రేమికులకు మంచి గీతాలను అందించటమే ఆదిత్యా మ్యూజిక్ లక్ష్యం అని ఆయన అన్నారు. 
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం లో, అక్కినేని నాగేశ్వర రావు గారి దేవదాస్ చిత్రం లో ని  మరపురాని గీతం “పల్లెకు పోదాం” ను రీమిక్స్ చేయటం జరిగింది. ఈ పాట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఈ చిత్రం ఆడియో ను ఆగస్ట్ మొదటి వారం లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Leave a Reply