ఆటాడుకుందాం రా రివ్యూ…

  aataadukundam raa movie reviewచిత్రం :  ఆటాడుకుందాం రా
నటీనటులు : సుశాంత్‌, సోనమ్‌ బజ్వా
సంగీతం : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : జి. నాగేశ్వర్ రెడ్డి
నిర్మాత : చింతలపూడి శ్రీనివాస్, ఎ.నాగ సుశీల
రిలీజ్ డేట్ :19 ఆగస్టు 2016.

‘కాళిదాసు’ చిత్రంతో అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్. ఆయన చేసిన చిత్రాల్లో ‘కరెంట్’ మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించింది. సుశాంత్ ని’అడ్డా’ ఏమాత్రం ఆదుకోలేదు. ‘దొంగాట’ ఆడిన కలసిరాలేదు. దీంతో.. కాస్త విరామం తీసుకొన్న సుశాంత్ “ఆటాడుకుందాం రా” చిత్రంతో ప్రేక్షకుల ముందు వచ్చేస్తున్నాడు. కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుశాంత్ – సోనమ్ బజ్వా జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్.  టైం మిషన్‌ లో ట్రావెల్ తె రకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి.. సుశాంత్ ‘ఆటాడుకుందాం రా’ ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది.. తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
అనగనగా ఇదరు స్నేహితులు. విజయరామ్ (మురళి శర్మ), ఆనంద్ ప్రసాద్ (ఆనంద్)లు. ఆనంద్ ఇచ్చే సలహాలతో వ్యాపారంలో విజయరామ్ కోట్లు గడిస్తాడు. శాంతారామ్ అనే వ్యక్తితో విజయరామ్‌ బద్దశతృత్వ ఉంటుంది. విజయరామ్ ని దొంగదెబ్బతీసిన శాంతారామ్.. ఆ మోసాన్ని ఆనంద్ పై వేస్తాడు. దీంతో.. విజయరామ్, ఆనంద్ ఇద్దరూ విడిపోతారు. విజయరామ్‌ కి అల్లుడైన కార్తీక్ (సుశాంత్) అమెరికా నుంచి ఇండియాకి ఓ పని మీద వస్తాడు.  విజయరామ్‌ కేమో కార్తీక్ కుటుంబం అంటే అస్సలు నచ్చదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయరామ్ కుటుంబానికి కార్తీక్ ఎలా దగ్గరయ్యాడు. ఆ కుటుంబం కష్టాలని ఎలా తీర్చాడు. కథలో ప్రియురాలు శృతి (సోనామ్ బజ్వా) ఎవరు? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
*  పృథ్వీ
* టైమ్ మెషీన్ కాన్సెప్ట్
* ఝాన్సీ కామెడీ
* నాగ చైతన్య స్పెషల్ ఎంట్రీ

మైనస్ పాయింట్స్ :
* కథ-కథనం
* సెకండాఫ్
* సంగీతం
* లాజిక్ లేని సన్నివేశాలు

నటీనటు ఫర్ ఫామెన్స్ :
జీ. నాగేశ్వర్ రెడ్డికి కామెడి చిత్రాల దర్శకడని పిలుచుకుంటారు. ఈ చిత్రంలోనూ ప్రేక్షకులని నవ్వించాడు. కానీ, కథ-కథనాలు మరీ బలహీనంగా ఉన్నాయి. కేవలం కామెడీ సీన్స్ ఏవో ఏపీసోడ్ వైస్ గా వస్తుంటాయి. టైం ట్రావెల్ నేపథ్యమని చెప్పుకొచ్చారు. అది కాస్త నవ్వులు పూయించినా.. అనవసమైన కాన్సెప్ట్ అది. ఒక నీరసమైన కథ, కథనాలతో సినిమా తీయడం దగ్గర దర్శకుడు విఫలమయ్యాడు. కథానాయకుడు సుశాంత్ కాస్త మెరుగుపడినట్టు
కనిపించాడు. కమర్షియల్ హీరో చేసే డ్యాన్సులు, ఫైట్స్.. అన్నీ చేయగలనని సుశాంత్ ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక సోనమ్ భజ్వా నటన పరంగా ఫర్వాలేదనిపించినా, పాటల్లో అందాల ప్రదర్శన చేసింది. చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం ఫుల్ లెన్త్ కామెడీ పాత్ర చేసిన పెద్దగా నవ్వించలేకపోయాడు.
పృధీ-సుశాంత్ లమధ్యసాగే కామెడీ సీన్స్ భలే గున్నాయి. నాగా చైతన్య స్పెషల్ ఎంట్రీ కథకి కనెక్ట్ అయ్యింది.

సాంకేతిక విభాగం :
ఓ తెలిసిన కథ.. సాదాసీదా కథనం ఉన్నప్పుడు సాంకేతిక విభాగం స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడైనా సినిమా కొద్దిలో కొద్దిగానైనా నిలబడే అవకాశాలున్నాయి.
అయితే, ఈ సినిమా విషయంలో కథ-కథనంతో పాటుగా సాంకేతిక అంశాలు పలుచగానే ఉన్నాయి. అనూప్ పాటలతో పర్వాలేదనిపించినా.. బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. టైం మిషన్ కాన్సెప్ట్ ని పెట్టుకొన్న విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాగోలేదు. సినిమాకి ఇంకా కత్తెర పెట్టాల్సి ఉంది. సినిమాటోగ్రఫీ పనితనం మాత్రం బాగుంది.

తెలుగుబుల్లెట్ అనాలసిస్ :
కథ-కథనం ఇవేవీ పట్టించుకోవడం ప్రక్కన పెట్టి రెండున్నర గంటల్లో అప్పుడప్పుడు నవ్వుకొన్నా పర్వాలేదని భావిస్తే.. ఆటాడుకుందా రా థియేటర్ వైపు వెళ్లొచ్చు. లేదంటే.. ఓ బ్యాట్ పట్టుకొని క్రికెట్ మైదానంలోకి మన ఆటాడుకుంటే ఇంకా మంచింది.
రేటింగ్ : 2/5

బాటమ్ లైన్ : ఆటాడుకుందాం రా.. అకడక్కడ మాత్రమే నవ్వులు!

SHARE