ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి మూవీ రివ్యూ…

 Posted November 4, 2016

aavu puli madhyalo prabhas pelli movie review
చిత్రం : ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి (2016)
నటీనటులు : కాళకేయ ప్రభాకర్, ఏ. రవితేజ, అశ్విని
సంగీతం : ఎం.టి.కవి శంకర్
దర్శకత్వం : ఎస్.జె.చైతన్య
నిర్మాత : రవి పచ్చిపాల
రిలీజ్ డేట్ : 4నవంబర్, 2016.

రాజమౌళి ‘బాహుబలి’తో కాలికేయగా ఫేమస్ అయిపోయాడు నటుడు ప్రభాకర్. బాహుబలి తర్వాత స్మితతో కలసి ‘కలికి.. ‘ పాటను కూడా పాడేశాడు. ప్రభాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి’.ఎస్.జె.చైతన్య దర్శకుడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకొంది. ఓ మాదిరి అంచనాల మధ్య ఈరోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది. ఈ వైరైటీ టైటిల్ తో వచ్చిన సినిమా అసలు కథేంటీ.. ?తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
నాని (ప్రభాకర్) నెల్లూరు రౌడీ. నెల్లూరు జిల్లాలో భూ కబ్జాలకి పెట్టింది పేరు. ఇతగాడికి ఆడవాళ్లంటే అసహ్యం. ప్రేమ మాట పెదాల వెంట వినిపిస్తే ప్రాణం తీస్తాడు. నాని చెల్లలు అమృత (అశ్విని). ప్రభాస్ ని పిచ్చి పిచ్చగా ప్రేమిస్తోంది. హీరో ప్రభాస్ ని కాదు. సినిమాలో ఓ ప్రభాస్ క్యారెక్టర్ ఉంది లేండీ. అయితే, అన్నయ్యకు బయటపడి ప్రేమ విషయాన్ని చెప్పలేకపోతోంది. ఈ టైంలో ప్రభాస్ (రవితేజ) అనే మరో వ్యక్తి అమృతం హెల్ప్ చేస్తాడు.ఇంతకీ ఈ ప్రభాస్ ఎవరు ? అశ్విని ప్రేమని ప్రభాస్ ఎలా గెలిపించాడు.. ?? అన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* కామెడీ
* ప్రభాకర్
* ఇంటర్వెల్ టిస్ట్

మైనస్ పాయింట్స్ :
* స్ర్కీన్ ప్లే
* సాగదీత
* సాంగ్స్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
దర్శకుడు చైతన్య.. రాంగోపాల్ వర్మ శిష్యుడు.అందుకు తగ్గట్టుగానే వర్మ తరహాలో డార్క్ కామెడీ ప్రయత్నం చేశాడు. కానీ..పూర్తిగా విఫలమయ్యాడు.సినిమాలో మూడు ట్విస్టులు. వాటిని కలుపుకునేందుకు మాత్రమే కథని అల్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సీరియస్ కథని కామెడీతో చెప్పాలని ట్రై చేసిన ప్రయత్నం బాగానే ఉన్నా. అందులో సక్సెస్ కాలేకపోయాదు దర్శకుడు. ఈ సినిమాకి ఏకైక ప్లస్ పాయింట్ ప్రభాకర్. చాలా బాగా యాక్ట్ చేశాడు.హీరోయిన్ నటనలో ఇంకా ఇంప్రూల్ కావాలి. రవితేజ క్యారెక్టర్ బాగున్నా.. అతని నటన ఓవర్ యాక్షన్ లా ఉంది. దీంతో.. ఆ పాత్ర సరిగ్గా పండలేదు. మిగితా నటీనటులు పెద్దగా రిజిస్టర్ కారు.

సాంకేతికంగా :
స్క్రీన్ ప్లే బాగులేదు. పాటలు బోరింగ్ గానే ఉన్నాయి. అయితే, నేపథ్య సంగీతం ఆకట్టుకొంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. చిన్న బడ్జెట్ సినిమా అయినా.. క్వాలిటీగా తీశారు. కొత్త కాన్సెప్ట్ కామెడీ సరిగ్గా పండితే ఆవు పులి మధ్య ప్రభాస్ ప్రెళ్లి కాస్త గ్రాండ్ గా ఉండేది. అన్ని సగం సగం అమరడంతో.. ప్రభాస్ పెళ్లి పేలవంగా ఉంది. అయితే, ప్రభాకర్ నటనకి మాత్రం మంచి మార్కులే పడతాయి. ప్రభాకర్ ప్రధాన పాత్రలో మరిన్ని సినిమాలు చేయొచ్చన్నది ఈ సినిమాతో స్పష్టమైంది.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
అసలే తెలుగు ప్రేక్షకులు రాంగోపాల్ వర్మని భరించలేకపోయారు.వర్మ పైత్యం ఇప్పుడు ఆయన శిష్యుడిని అంటూ చెప్పుకొంటున్న దర్శకుడు చైతన్య చూపించినట్టు అనిపించింది. అయితే, ఈ శుక్రవారం ఇన్ని ఆప్షన్స్ మధ్య ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లికి వెళ్లడం సాహసమే అవుతుంది.

బాటమ్ లైన్ : ప్రభాస్ పెళ్లి.. పేలవంగా జరిగింది
రేటింగ్ : 1.5/5

SHARE