అభినేత్రి మూవీ ప్రివ్యూ…

Posted October 7, 2016

 abhinetri movie preview

చిత్రం : అభినేత్రి
న‌టీన‌టులు : ప్రభుదేవ,తమన్న,సోను సూద్
సంగీతం : సాజిద్ వాజీద్ ,విషాల్  మిష్రా
దర్శకత్వం : ఏ.ఎల్.విజయ్
నిర్మాత‌లు : ప్రభు దేవ
రిలీజ్ డేట్‌ : 7 అక్టోబర్ 2016

ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘అభినేత్రి’. హారర్ కామెడీ జానర్స్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘అభినేత్రి  చిత్రం పోస్టర్స్, ట్రైలర్స్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. సో.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాం ఎక్కవగానే వుంది.మరి ఆలేస్యం దేనికి అభినేత్రి హైలైట్స్ పై ఓ లుక్కేద్దాం పదండీ..

 

కథేంటీ ?.. చిత్రబృందం కథనాల ప్రకారం :

సౌతిండియన్ సినిమాలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోన్న తమన్నా,  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ‘అభినేత్రి’ తో భయపెట్టాటానికి సిధ్దం గా వుంది. కృష్ణ అనే ఓ పల్లెటూరి వ్యక్తి సిటీ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అయితే అనుకోని కారణాల వల్ల పల్లెటూరి అమ్మాయినే చేసుకోవాల్సి వస్తుంది. ఆతర్వాత వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? వీరి మధ్య ప్రేమ పుట్టడానికి ఒక దయ్యం ఎలా కారణమైంది? అన్నదే సినిమా అసలు కథ అని టాక్.

ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్లో మిల్కీ బ్యూటీ డాన్స్ లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. తమన్నా హారర్ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం మూడు భాషల్లో నేడు విడుదల అవుతుంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్య నారాయణ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు విజయ్ దర్శకత్వం వహించాడు సాజిద్-వాజిద్, జీవీ ప్రకాష్ మరియు విశాల్ కలిసి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు

SHARE