అభినేత్రి మూవీ రివ్యూ..

Posted October 7, 2016

  abhinetri movie review

చిత్రం : అభినేత్రి (2016)
నటీనటులు : ప్రభుదేవా, తమన్నా, సోను సూద్
సంగీతం : సాజిద్- వాజిద్, విశాల్ మిశ్రా
దర్శకత్వం : ఏ.ఎల్ అజయ్
నిర్మాత : ఎమ్.వి.వి. సత్యనారాయణ
విడుదల తేదీ : 07అక్టోబర్, 2016.

లేడీ ఓరియెంటెడ్ చిత్రం “అభినేత్రి”లో తమన్నా.. అనగానే ఓ రకమైన ఆసక్తి నెలకొంది. పైగా.. 1947 ఏ లవ్ స్టోరీ, నాన్న, అన్న.లాంటి కథాబలమున్న  సినిమాలని అందించిన దర్శకుడు. ఇండియన్ మైకల్ జాక్సెన్ ప్రభుదేవా,సోనుసూద్ లు కీలక పాత్రధారులు అనడంతో..అభినేత్రిపై అంచనాలు పెరిగిపోయాయి. అభినేత్రి.. తెలుగు , తమిళ, హిందీ భాషల్లోనూ తెరకెక్కింది. తెలుగులో ‘అభినేత్రి’ని ప్రముఖ రచయిత కోన వెంకట్ సంభాషనలు సమకూర్చారు. ఈ హార్రర్ కామెడీ చిత్రం దసరా కానుకగా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి.. ‘అభినేత్రి’గా తమన్నా ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది. ‘అభినేత్రి’ అసలు కథేంటో ?? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
కృష్ణ కుమార్ (ప్రభుదేవా) మాడ్రన్ భావలున్న కుర్రాడు. తన భావాలకి తగ్గట్టుగానే.. ఓ మోడ్రన్ గర్ల్ ని పెళ్లి చేసుకుని సుఖపడాలని ఆశపడుతుంటాడు. సిటీలో జాబ్ చేస్తోన్న కృష్ణ కుమార్ కి.. ఓ రోజు సడెన్ గా ఇంటి నుంచి ఫోన్.. నానమ్మ బాగోలేదు అర్జెంటుగా వచ్చెయ్ అన్ కబర్. దీంతో.. హడావుడిగా ఇంటికెళ్లి కృష్ణకి.. అంతే హడావుడిగా ఓ పల్లెటూరు అమ్మాయి అభినేత్రి (తమన్నా) ని చూసి బలవంతగా పెళ్లి చేస్తారు కుటుంబ సభ్యులు. పెళ్లి తర్వాత ముంబైలో కాపురం పెడుతోంది… ఈజంట. కొన్ని రోజులుగా బాగానే సాగినా క్రమ క్రమంగా అభినేత్రిలో మార్పులు కనిపిస్తుంటుంది. ఆ మార్పుకి కారణమేంటని ఆరాతీస్తే.. అభినేత్రిని ఓ దెయ్యం ఆవహించిందని విషయం తెలుస్తొంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడు.. ? అభినేత్రి మళ్లీ మాములు మనిషిగా మారిందా.. ?? కథలో సోనూసూద్ ఎవరు.. ??? అన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* తమన్నా
* ప్రభుదేవా
* డ్యాన్స్

మైనస్ పాయింట్స్ :
* రొటీన్ స్టోరీ
* కామెడీ మిస్
* లో వోల్టేజ్ హర్రర్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

‘అభినేత్రి’.. హారర్ కామెడీ చిత్రం. ఇందులో హర్రర్ హడ్రెడ్ పర్సంట్ లేదు. కామెడీ కావాల్సినంత లేదు. దీంతో..అభినేత్రి కాస్త అర్థంభాగమే (సగం) మెప్పించింది. దర్శకుడు ఏ.ఎల్ విజయ్ భయపడే సన్నివేశాలని ఇంకాస్త బలంగా రాసుకొంటే బాగుణ్ను. మేకింగ్ విషంలో ఫర్వాలేదనిపించాడు. దర్శకుడు లెక్క తప్పాడు కానీ.. నటీనటులు ఎవ్వరు తగ్గలేదు. తమ్మన్నా అయితే ఇరగదీసింది. పల్లెటూరి యువతిగా,మోడ్రన్ గర్ల్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించింది. ఏ పాత్రకి ఆ పాత్రకి దగ్గ బాడీ లాంగ్వేజ్ తో కట్టిపడేసింది. డ్యాన్సుల్లోను ప్రభుదేవాతో పోటీపడింది. డ్యాన్సుల్లో ప్రభుదేవా గురించి చెప్పేదేముంది. అయితే, భయపడే భర్తగానూ ప్రభుదేవా బాగా చేశాడు. స్టార్ హీరోగా సోనూసూద్ ఆకట్టుకొన్నాడు. ఇక, మిగితా నటీనటుల పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.

సాంకేతికంగా :
సాదాసీదా కథకి ఇంకా సాదాసీదా స్క్రిన్ ప్లేతో ‘అభినేత్రి’ని అడ్డంగా ముంచాడు దర్శకుడు ఏ.ఎల్ విజయ్. చిత్రానికి డ్యాన్సులు హైలైట్ గా నిలిచాయి. సాజిద్- వాజిద్, విశాల్ మిశ్రా అందించిన పాటలు వినడానికి, చూడ్డానికి బాగలేవు. కానీ, నేపథ్యం సంగీతంతో ఆకట్టుకొన్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. గ్రాఫిక్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నట్లు కనబడుతోంది. మొత్తంగా.. తెరపై అభినేత్రి లుక్ రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కనబడుతున్నాయి.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
ఈ దసరా సీజన్ ప్రేక్షకులకి బోలేడు ఆప్షన్స్. అయితే, తమన్నా వీరాభిమానులు ‘అభినేత్రి’ని ఎంజాయ్ చేయొచ్చు. మిగితా ప్రేక్షకులు ‘అభినేత్రి’ చూసి
భరించడం కష్టమే.

బాటమ్ లైన్ : ‘అభినేత్రి’.. హర్రర్ తక్కువ.. కామెడీ అసలెతక్కువ !
రేటింగ్ : 2.75/5

SHARE