రాసలీలల మంత్రి వికారం …వీడియో

Posted December 14, 2016

absurd ministry gone,h.y methi,minister methi,methi absurd,methimaking disgusting issuesవయసు రాగానే సరిపోదు వివరం రావాలి అంటారు…సరిగ్గా ఆ మాట ఈ మంత్రి గారికి సరిపోతుంది.మనవడు,మునిమనవళ్ళతో కాలం గడిపే వయసులో ఇలాంటి పనులు చేస్తే పదవి మాత్రమే కాదు పరువు కూడా పోతుంది.సరిగ్గా అదే జరిగింది.. సెక్స్ ఆరోపణల్లో చిక్కుకున్న కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్.వై.మేతి అబ్బే నాకేం తెలియదు అని మొదట్లో బుకాఇంచినా చివరకి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. బాగల్‌కోట్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగిని బదలీ విషయమై కొన్ని రోజుల ముందు మోతీ వద్దకు వచ్చిందని, ఆమెకు సహాయం చేయాలంటే తన కోరిక తీర్చాలని పట్టుబట్టారని మోతీ మీద ఆరోపణలు వచ్చాయి. రాసలీలకు సంబంధించిన సెక్స్‌ వీడియో టేప్‌లు రిలీజ్ చేయకుండా అడ్డుకునేందుకు ఒక సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కార్యకర్తను మోతీ సహచరుడొకరు బెదరించినట్టు తేలడం తో మంత్రి మరింత చిక్కుల్లో పడ్డారు. మంత్రి సెక్స్ వీడియో టేప్‌లు ఇంకా వెలుగుచూడనప్పటికీ ఆర్టీఐ కార్యకర్తలను మంత్రి సహచరుడు బెదరించిన టెలిఫోన్ సంభాషణలను కన్నడ న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేశాయి. ఆడియో టేప్‌లు విడుదల చేయవద్దని, కొంత డబ్బు ముట్టచెబుతామని, తమ మాటవినని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించడం వంటివి ఆ టెలిఫోన్ సంభాషణల్లో చోటుచేసుకున్నాయి. మేతి రాజీనామాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమోదించారు. ఈ ఏడాది జూన్‌లోనే మేతీని కేబినెట్‌లో తీసుకున్నారు.సరిగా ఆరునెలలు తిరక్కుండా నే పదవి ఊడింది..

SHARE