అల్లు అర్జున్‌ కారుకు యాక్సిడెంట్‌!

0
535
accident in alluarjun car

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

accident in alluarjun car
సెలబ్రెటీ కారు యాక్సిడెంట్‌లు ఇటీవల కలవరంకు గురి చేస్తున్నాయి. వారం రోజుల క్రితం ఏపీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ తనయుడు నిషిత్‌ కారు యాక్సిడెంట్‌లో దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. ఆ సంఘటన ప్రతి ఒక్కరిలో కూడా భయాందోళనకు గురి చేస్తుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉండి, ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న నిషిత్‌ మరణం ప్రతి ఒక్కరిని కచి వేసింది. దాంతో ఇప్పుడు యాక్సిడెంట్‌ అంటేనే సెలబ్రెటీలు మరియు సాదారణ జనాలు ఉలిక్కిపడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్‌ కారుకు యాక్సిడెంట్‌ అయ్యిందనే వార్త ఫిల్మ్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

అల్లు అర్జున్‌ కారుకు యాక్సిడెంట్‌ అనే వార్తలు ఫిల్మ్‌ సర్కిల్‌లో దావాణంలా వ్యాప్తి చెందాయి. అయితే అల్లు అర్జున్‌ కారుకు యాక్సిడెంట్‌ అయిన విషయం నిజమే కాని, అందులో అల్లు అర్జున్‌ లేడు. జూబ్లీహిల్స్‌ అల్లు అర్జున్‌ కారు రోడ్డు పక్కన పార్క్‌ చేసి ఉంది. ఆ కారును ఒక ట్యాక్సీ ఢీ కొట్టడం జరిగింది. ట్యాక్సీ డ్రైవర్‌ రివర్స్‌ చేస్తుండగా, పొరపాటున అల్లు అర్జున్‌ కారుకు ఢీ కొట్టాడు. దాంతో బన్నీ కారు స్వల్పంగా డ్యామేజీ అయ్యింది. ఆ సమయంలో అక్కడే ఉన్న బన్నీ డ్రైవర్‌ ట్యాక్సీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. తమ కారు డ్యామేజీకి రెండు లక్షలు చెల్లించాల్సిందిగా బన్నీ డ్రైవర్‌ డిమాండ్‌ చేశాడు. అంత మొత్తం తన వద్ద లేవని చెప్పడంతో ట్యాక్సీ తాళాలను తీసుకున్నాడు బన్నీ డ్రైవర్‌. దాంతో ట్యాక్సీ డ్రైవర్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విచారణ మొదలు పెట్టి, ఇరువురు డ్రైవర్‌లను పిలిచి మాట్లాడటం జరిగింది. ఇద్దరి మద్య రాజీ కుదర్చడంతో వివాదంకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది.

Leave a Reply