బాబుకు దూర‌మ‌వుతున్న అచ్చెన్నాయుడు!!

0
388
achennayudu and chandrababu relationship

Posted [relativedate]

achennayudu and chandrababu relationship
ప్ర‌స్తుతం చంద్ర‌బాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు..భవిష్యత్తులో ఎర్ర‌న్నాయుడు రేంజ్ కు ఎదుగుతార‌ని టీడీపీ వ‌ర్గాలు భావించాయి. బాబు కూడా ఆయ‌న‌పై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఉత్త‌రాంధ్ర‌లో టాప్ లీడ‌ర్ ఆయ‌నే అవుతాడ‌ని ఆశించారు. కానీ అలాంటి నాయ‌కుడు ఇప్పుడు బాబుకు దూర‌మైపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది.

గ‌తంలో వైసీపీకి కౌంట‌ర్ ఇచ్చే విష‌యంలో బాబు … అచ్చెన్న‌తో సంప్ర‌దింపులు జ‌రిపేవారు. ఆయ‌న స‌ల‌హాలు తీసుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ప‌రిస్థితే లేదు. బాబు స‌న్నిహితుల జాబితా నుంచి ఆయ‌న పేరు డిలీట్ అయ్యింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు అచ్చెన్న స్వ‌యంకృతాప‌రాధ‌మే కార‌ణ‌మ‌ట‌.

గ‌త కొంత‌కాలంగా అచ్చెన్నాయుడ‌పై కంప్ల‌యింట్ ఎక్కువ‌య్యాయి. ఆయ‌నపై స్వ‌యానా ఎర్ర‌న్నాయుడు కూడా రామ్మోహ‌న్ నాయుడే .. బాబుకు కంప్ల‌యింట్ చేసిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఇక క‌ళా వెంక‌ట్రావు, గౌతు శ్యాంసుంద‌ర్, మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి కూడా అచ్చెన్న తీరుపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో అచ్చెన్యాయుడు ప్రవర్తన మీద ఫిర్యాదు చేసినట్టు టాక్. ఉత్త‌రాంధ్ర పాలిటిక్స్ లో త‌నదే పై చేయి కావాల‌ని ఆయ‌న బాగా ఆరాట ప‌డుతున్నార‌ట‌. దీంతో కొన్ని వివాదాల్లోనూ ఆయ‌న అన‌వ‌స‌రంగా క‌ల‌గజేసుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

అచ్చెన్న‌పై ఫిర్యాదులు, వివాదాలు పెర‌గ‌డంతో చంద్ర‌బాబు ఇక గ‌ట్టి నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అచ్చెన్న‌ను మంత్రి ప‌ద‌వి నుంచి తొలగించే అవ‌కాశ‌ముంద‌న్న గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే బాబు కూడా ఆయ‌న‌తో విష‌యం చెప్పేశార‌ట‌. మొత్తానికి అచ్చెన్నాయుడు ట్రాక్ త‌ప్పారు. చివ‌ర‌కు మంత్రిప‌ద‌వి ఉంటుందా… ఊడుతుందా… అన్న ప‌రిస్థితి ఇప్పుడు వ‌చ్చింది. అంతే మ‌రి రాజ‌కీయ నాయ‌కుడు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిణతి చెందాలి. లేకపోతే ఇలాంటి ప‌రిస్థితి రాక త‌ప్పుదు. మ‌రి ఇప్ప‌టికైనా అచ్చెన్న మారుతారా.. లేక పూర్తిగా ట్రాక్ త‌ప్పి… పార్టీకే దూర‌మ‌వుతారా… చూడాలి!!!

Leave a Reply